SA vs IND: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. మూడో టీ20 భారత్‌దే!
- తిలక్ వర్మ మెరుపు సెంచరీ
- అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ
- యాన్సెన్ సంచలన ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. 220 పరుగుల ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 208 పరుగులు చేయడంతో టీమిండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (41; 22 బంతుల్లో 1×4, 4×6), మార్కో యాన్సెన్ (54; 17 బంతుల్లో 4×4, 5×6) సంచలన బ్యాటింగ్‌తో కంగారెత్తించినా.. చివరికి భారతే పైచేయి సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి టీ20 శుక్రవారం జరుగుతుంది.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్ డకౌట్ అయినా.. అభిషేక్ శర్మ (50; 25 బంతుల్లో 3×4, 5×6), తిలక్ వర్మ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6)ల మెరుపులతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందొచ్చిన తిలక్.. దక్షిణాఫ్రికా బ్యాటర్లపై దాడి చేశాడు. దాంతో పవర్ ప్లే ముగిసేసరికే భారత్ 70/1తో నిలిచింది. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న భారత్‌కు షాక్ తగిలింది. అభిషేక్‌తో పాటు సూర్యకుమార్ (1) వరుస ఓవర్లలో నిష్క్రమించగా.. హార్దిక్ పాండ్యా (18) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. రమణ్‌దీప్ (15; 6 బంతుల్లో 1×4, 1×6) అండతో తిలక్ రేచిపోయి సెంచరీ చేశాడు.
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
ఛేదనలో దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే దక్కింది. రికిల్‌టన్ (20), హెండ్రిక్స్ (21) వేగంగా ఆడినా.. త్వరగా అవుట్ అయ్యారు. స్టబ్స్ (12), మార్‌క్రమ్ (29)ని భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. దాంతో 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 4 వికెట్లను 84 రన్స్ చేసింది. ఈ సమయంలో క్లాసెన్ సిక్స్‌లతో చెలరేగిపోయాడు. దాంతో 15 ఓవర్లకు స్కోరు 134/4గా నిలిచింది. చివరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 86 పరుగులు చేయాల్సి ఉన్నా క్లాసెన్ దూకుడు భారత్‌ను కలవరపెట్టింది. 19వ ఓవర్లో హార్దిక్ 30 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికాకు 25 పరుగులు అవసరం కాగా.. ఆర్ష్‌దీప్ చక్కగా బౌలింగ్ చేశాడు.
తాజావార్తలు
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!