IND vs SA: తెలుగోడి దెబ్బకి విలవిలాడిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ
- సెంచూరియన్ వేదికగా భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్.
- టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
- తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సెంచరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA: సెంచూరియన్ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సెంచరీతో దక్షిణాఫ్రికా బౌలర్లను చితకబాదాడు. మరోవైపు వరుస వికెట్లు పడిపోతున్న తాను మాత్రం సిక్సర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదటి ఓవర్ రెండో బంతికే సంజు శాంసన్ డకట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ మొదటి నుంచే అటాకింగ్ గేమ్ మొదలు పెట్టాడు. ఈ నేపథంలో తిలక్ వర్మతోపాటు అభిషేక్ శర్మ కూడా తనవంతు సహకారాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ రెండో వికెట్ కి 107 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత అభిషేక్ శర్మ 24 బంతులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తరువాత బాల్ కు వెనురిగాడు. దీంతో పార్ట్నర్షిప్ కు బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్కరు తిలక్ వర్మకు పెద్దగా సపోర్ట్ అందించలేదు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది.
Also Read
ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తిలక్ వర్మ తన టీ20 కెరియర్లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. 51 బంతుల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. మొత్తానికి తిలక్ వర్మ 56 బంతులతో 107 పరుగులు చేశాడు. ఇక టీమిండియా బ్యాటింగ్లో అభిషేక్ శర్మ 50, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 1, హార్థిక్ పాండ్యా 18, రింకు సింగ్ 8 తక్కువ పరుగులకే అవుట్ కావడంతో నిరాశపరిచారు. చివరిలో మొదటి మ్యాచ్ ఆడుతున్న రామన్దీప్ సింగ్ తాను ఆడిన మొదటి బంతికే సిక్స్ కొట్టాడు. చివరికి 6 బంతుల్లో 15 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. మరోవైపు వైపు దక్షిణాఫ్రికా బౌలర్లు.. అందిలే సిమెలనే, కేశవ్ మహారాజ్ లు చెరో రెండు వికెట్లు తీసుకోగా, మార్కో జాన్సెన్ ఒక వికెట్ ను తీసుకున్నాడు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!