Sonia Gandhi: బీజేపీ అమెరికన్ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్‌పై విరుచుకుపడుతోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అమెరికాలోని డీప్‌స్టేట్, దాని వెనక జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు కుట్రలు చేస్తు్న్నారని, ఈ కుట్రల వెనక అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు.
వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ హౌజ్‌లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు.
హన్మకొండ ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఉక్కు మహిళ అని కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలని ఉక్కు సంకల్పంతో ఉన్నామని, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే నేను సీఎం అయ్యానని ఆయన అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ టార్గె్ట్‌గా కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. ‘‘రాహుల్ బాబా’’ అనే పేరు కలిగిన విమానం ఇప్పటికే 20 సార్లు కూలిపోయిందని, నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత 21వ సారి కూలిపోనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రముఖ ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ దఫా 400 సీట్లు అన్న వారు... 240 సీట్లు సాధించారు...
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, అది దేశంలో ఎక్కడా లేనంత సులభతర వాణిజ్య విధానాల ద్వారా సాధ్యమైందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మలేషియా రాష్ట్రం కౌలాలంపూర్లో ఆదివారం జరిగిన తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం ద్వారా, మలేషియా పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తాము వారికి ఆహ్వానాన్ని వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యల గురించి హైదరాబాద్ పర్యటనలో మాట్లాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదని.. బీఆర్ఎస్కు ప్రజలు వీఆర్ఎస్ ( రిటైర్ మెంట్)ఇచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని.. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్క తోక పటాకులు పేలుతాయా లేక సూతిల్ బాంబులు పేలుతాయో చూడాలన్నారు. అవినీతి పరులను అరెస్ట్…
సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఖర్గే అగ్రనేతలందరూ మాట ఇచినట్టే కుల గణన చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నామని, నవంబర్ 31 లోగా కులగణన ను రేవంత్ రెడ్డి చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు కూడా అందుబాటులో ఉంటాయని, కేటీఆర్ హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. రాజకీయ…
కేసీఆర్ తెలంగాణను అల్లకల్లోలం చేసి పోయిండు.. ఏడు లక్షల కోట్లు అప్పుచేసి పోయిండని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఇవాళ వికారాబాద్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. నెలకు రూ.7 వేల కోట్లు మిత్తి కడుతున్నామని, కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండే అని ఆయన వ్యాఖ్యానించారు.