AICC New Office: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌కు కాంగ్రెస్ పార్టీ వీడ్కోలు చెప్పింది. కొత్తగా నిర్మించిన పార్టీ కేంద్ర కార్యాలయానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు. దీన్ని పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు.
Harish Vs Ponnam: దేశానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని హరీష్ రావు అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనూహ్యంగా ఎదిగారన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ఇప్పుడు ప్రజల సందర్శనార్ధం డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఇక్కడ ప్రజలు ఆయనకు నివాళులు అర్పిస్తారు. దీని తర్వాత అతని అంత్యక్రియలు నిగంబోధ్ ఘాట్‌లో నిర్వహిస్తారు. ఆర్మీ వాహనంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి భౌతికకాయాన్ని తీసుక వచ్చారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆర్మీ వాహనం ఆపి, ఆయన మృతదేహాన్ని భుజాలపై మోసుకొని లోపలికి తీసుకెళ్లారు.…
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Congress: భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఘన నివాళులు అర్పించారు.
Sonia Gandhi: మహాత్మా గాంధీ వారసత్వం ముప్పులో ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు అన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారు, వారికి మద్దతు ఇచ్చే సంస్థల నుంచి మహాత్మా గాంధీ వారసత్వం ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. పరోక్షంగా బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్పై సోనియా గాంధీ దాడి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గాంధీ సిద్ధాంతాలు, సంస్థలు దాడులకు గురవుతున్నాయని అన్నారు. ఈ శక్తుల్ని ఎదుర్కోవడానికి మన సంకల్పాన్ని పునరుద్ధరించడం…
M Jethamalani: సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కాశ్మీర్‌ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది.
ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (ఎఫ్డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు ద్వారా పంచుకుంది . "కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న ఆలోచనకు ఈ ఫౌండేషన్ మద్దతు తెలిపింది. భారత అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ" అని పేర్కొంది.
CM Revanth Reddy: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఫైనల్లో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. ఆసియాకప్ విజేతగా బంగ్లాదేశ్ దివారం నాడు జరిగిన అండర్-19 ఆసియా కప్ 2024 టైటిల్‌ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కాపాడుకుంది. 9వ ట్రోఫీని గెలుచుకోవాలన్న భారత్ కల నెరవేరలేకపోయింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటికి ఎనిమిది సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. బంగ్లాదేశ్…