National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
DK Shivakumar: వరస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటక సంక్షోభం కొత్త తలనొప్పిగా మారింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోరాటం కొనసాగుతోంది. చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం అనే ఒప్పందం ప్రకారం, తనకు అవకాశం ఇవ్వాలని డీకే కోరుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం డీకే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2004లో యూపీఏ ఘన విజయం సాధించిన తర్వాత, సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని…
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. సిద్ధరాయమ్యను దించేసి, డీకే శివకుమార్‌ను అధిష్టానం సీఎంగా చేస్తుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు వర్గాలు కూడా తమ బాస్‌లకే సీఎం పదవి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి.
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగించాలా? లేక డీకే శివకుమార్‌కు పగ్గాలు అప్పగించాలా? అని కాంగ్రెస్ హైకమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కర్ణాటక పంచాయతీ కొనసాగుతూనే ఉంది.
TPCC Mahesh Goud : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనలో సోనియా గాంధీ చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ, “సోనియా మహా దేవత లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు” అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దండుకుంది. ప్రజల ఆస్తులను ద్వంసం చేసి, నేతలు డబ్బులు దోచుకెళ్లారు.…
Happy Birthday CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా భారీగా విషెస్ చెబుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే విషేస్ చెప్పారు.
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీ కాలంలో సగం కాలం పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన తదుపరి సీఎం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర నాయకత్వ మార్పుపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bihar Elections 2025: బీహార్ సమరానికి అన్ని పార్టీలు సై అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరం సన్నాహాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువ అయ్యి, అనేక హామీలను గుప్పిస్తున్నారు. నామినేషన్ దాఖలు గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో వరుస ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నాయి. ఇదే సమయంతో మొదటి దశకు ఎన్నికలకు పోటీ పడుతున్న మహా కూటమి అభ్యర్థుల తరుఫున ప్రచారం…
ప్రధాని తల్లి గురించి కాంగ్రెస్ ఏఐ వీడియో చేయడం సిగ్గుచేటని గోవా ఆరోగ్య మంత్రి రాణే అన్నారు. విశ్వజిత్ రాణే, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ రాణే కుమారుడు. ప్రతాప్ సింగ్ గోవాకు ఏడు సార్లు సీఎంగా పనిచేశారు. 50 ఏళ్లు అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు. 2017లో విశ్వజిత్ రాణే బీజేపీలో చేరారు. ప్రస్తుతం, ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఉన్నారు.