Emergency: జూన్ 25, 1975 ఎమర్జెన్సీ విధించిన రోజును భారతదేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా పేర్కొంటారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నేటిలో ఎమర్జెన్సీ విధింపుకు నేటిలో 50 ఏళ్లు గడిచాయి.
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్‌లో గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే రాయ్‌బరేలీలో తన పట్టును కొనసాగిస్తూనే, అమేథీ స్థానాన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. మోడీ ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందుగానే శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మోడీ ప్రమాణస్వీకారానికి షేక్ హసీనా పాల్గొన్నారు. సోమవారం కూడా ఆమె పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది.
సోనియాగాంధీ మరోసారి కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఎంపికయ్యారు. 2024, జూన్ 8వ తేదీ శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నియమించాలనే తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.
PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలని ట్వీట్ చేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్స వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు. అనంతరం.. పలు విషయాలపై చర్చించనట్లు సమాచారం. కాసేపటి క్రితమే సోనియా గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది.
CM Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా చేర్చేందుకు పీసీసీ ప్రయత్నిస్తోంది.