Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదం..
- పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగపై ప్రతిపక్షాల విమర్శలు..
- రాష్ట్రపతిని అవమానించారని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi: పార్లమెంట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. సోనియా గాంధీ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ద్రౌపది ముర్ము సుదీర్ఘ ప్రసంగం తర్వాత అలసిపోయినట్లు కనిపించారని కాంగ్రెస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలు ‘‘అవమానకరమైనవి’’ అని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేసింది. బడ్జెట్ సమావేశాలకు ముందు శుక్రవారం ఉదయం పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు.
Read Also: U-19 World Cup 2025: ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత మహిళల జట్టు..
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
‘‘రాష్ట్రపతి ప్రసంగం చివరి సమయానికి అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయింది, పాపం’’ అని సోనియా గాంధీ మీడియాతో మాట్లాడటం వివాదాస్పదమైంది. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ‘‘బోరింగ్’’గా పిలిచారు. అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. పార్టీ చీఫ్ జేపీ నడ్డా మాట్లాడుతూ.. రాష్ట్రపతి గురించి, అత్యున్నత రాజ్యాంగ పదవి గురించి ప్రతిపక్షాల వైఖరిని ఇది స్పష్టం చేస్తుందని అన్నారు. ‘‘ రాష్ట్రపతి ప్రభుత్వ విజయాలను చెబుతుంటే, ప్రతిపక్షాలు, దాని భాగస్వామ్య పక్షాలు వెనకబడిన తరగతుల, మహిళ సాధికారతను ఎగతాళి చేస్తు్న్నాయి’’ అని అన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు పేదల, గిరిజన వ్యతిరేకత స్వభావాన్ని చూపిస్తున్నాయి, ప్రతిపక్షం బేషరతుగా క్షమాపనలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పూర్ణియా ఎంపీ పప్పూ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిని ప్రభుత్వానికి రబ్బర్ స్టాంప్ అని, ఆమె ప్రేమ లేఖని చదివారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఫన్నీగా, నిరుత్సాహభరితంగా ఉందని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. అయితే, ప్రతిపక్షాల వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందించారు. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిని అవమానించడం కాంగ్రెస్ అసలు స్వభావాన్ని తెలియజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ కుటుంబం వెలుపల వ్యక్తి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉండటాన్ని నకిలీ ఘాండీ కుటుంబం సహించడం లేదని ఆయన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..