Congress: భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ భౌతికకాయం వద్ద కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమె ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుని ఘన నివాళులర్పించారు. ఇక, మీడియాతో రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ.. దేశ అభివృద్ధికి కృషి చేసే వారని చెప్పుకొచ్చారు. ఆర్థిక రంగంలో అనేక విషయాలపై ఆయనకు చాలా పరిజ్ఞానం ఉందని పేర్కొన్నారు.