ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ఘాటైన వ్యాఖ్యలు కొనసాగుతూనే వున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా అంశం తొలగింపు వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపించారు. దీని వెనుక ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రమేయం కూడా ఉందంటూ బీజేపీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. మొదట అనుకున్న అజెండాలో మార్పులు చేసిన విషయం తెలిసిందే.. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు లేకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర హోంశాఖ.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి (కేంద్ర, రాష్ట్ర వ్యవహరాలు) నేతృత్వంలో “వివాద పరిష్కార సబ్ కమిటీ” ఏర్పాటు అయిన విషయం తెలిసిందే.. అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు…
ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అవగాహన కల్పించేందుకు ఏపీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ పర్యటించారు. అయితే నేడు గాన కోకిల లతా మంగేష్కర్ మరణించిన నేపథ్యంలో ఆమె మృతిపట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నేతలు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. లతా మంగేష్కర్…
పీఆర్సీపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఉద్యోగులు హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వారిని నిర్భంధించే చర్యలు మానుకోవాలి. ముందస్తు నోటీసులిచ్చి అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఉద్యోగ సంఘాలను నిర్భందించడం అంటే జగన్ తనను తానే నిర్భందించుకున్నట్లు అని ఆయన అన్నారు. ప్రభుత్వం, ఉద్యోగుల…
హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం.. వాటిని వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో తిరుమల స్వామి దేవాలయం వద్ద అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులకు ఇక్కడకొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. Read Also: నేరగాళ్లకు ఏపీ ఫ్రెండ్లీ స్టేట్‌గా…
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు. విశాఖలో ఉన్న లక్షలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఈఎస్ఐ ఆస్పత్రి, వైద్య కళాశాల నిర్మించాలని కేంద్రం ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగా కళాశాల లేకుండా ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. కేవలం ఆసుపత్రి నిర్మాణానికి రూ. 400 కోట్లు నిధులు కేంద్రం కార్మిక శాఖ మంజూరు చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్ధలం సేకరించి ప్రతిపాదనలు…
రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఉండాలనేది బీజేపీ విధానమని అన్నారు. వాస్తవానికి 2014 మేనిఫెస్టోలోనే 25 జిల్లాల ఏర్పాటు గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. కొత్త జిల్లాల్లో విలీనమయ్యే ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాల ఎంపిక, పేర్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని వీర్రాజు సూచించారు. ‘‘ఇప్పటికే మా పార్టీ…
ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి విమర్శలు చేశారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు. సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులు, గంగిరెద్దుల పోటీలు, హరిదాసుల పాటలు అని.. కానీ వైసీపీ సర్కారు క్యాసినో సంస్కృతిని తీసుకొచ్చి పండగ వాతావరణాన్ని అబాసుపాలు చేసిందని మండిపడ్డారు. ఏపీలో జిల్లాల విభజనపై ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకువచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు బీజేపీ సిద్ధంగా…