తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించేందుకు తేదీ, సమయం నిర్ణయించిన కేంద్రం.. మొదట అనుకున్న అజెండాలో మార్పులు చేసిన విషయం తెలిసిందే.. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా, రెవిన్యూ లోటు లేకుండా కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర హోంశాఖ.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి (కేంద్ర, రాష్ట్ర వ్యవహరాలు) నేతృత్వంలో “వివాద పరిష్కార సబ్ కమిటీ” ఏర్పాటు అయిన విషయం తెలిసిందే.. అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.. అయితే, ప్రత్యేక హోదాకు తెలంగాణకు సంబంధం లేదు.. హోదాకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
Read Also: Lockdown Parties: మందు పార్టీ..! చిక్కుల్లో ప్రధాని..
ఇక, రాష్ట్రంలో 63వేల కోట్లతో కేంద్రం రహదారుల నిర్మాణం చేపట్టిందని తెలిపారు సోము వీర్రాజు.. రాష్ట్రంలో కేంద్రం నిర్మించే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించి రద్దు చేసిందని ఆరోపించిన ఆయన.. కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులను వినియోగించుకోలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ ఎద్దేవా చేశారు.. మరోవైపు.. ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వదు అని ప్రశ్నించారు సోము వీర్రాజు.