ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరాల జల్లులు కురిపించారన్న ఆయన.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యిందని కేంద్ర మంత్రి ప్రకటించారని గుర్తుచేశారు.. ఇక, కోనసీమ రైల్వే లైనుకి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కట్టకపోవడంతో బీజేపీ మాత్రమే ఉద్యమం చేస్తోందని ప్రకటించిన ఆయన.. అదేవిధంగా కడప-బెంగుళూరుకు రైల్వే లైనుకి రాష్ట్ర ప్రభుత్వం…
మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ మరోసారి ప్రకటన చేయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయగా తాజాగా బీజేపీ కూడా జగన్ ప్రకటనను తప్పుబట్టింది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటపై సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా మడం తిప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అమరావతి రాజధానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కట్టుబడి ఉందని ఆయన…
కర్నూలులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ భేటీలో పలువురు బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పేందుకు వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఏపీపై ప్రత్యేక ప్రేమతో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను కేంద్రం ఏపీకి ఇస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ…
APCC Working President Narreddy Tulasi Reddy Fired on BJP. బీజేపీ రణభేరిపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఆయన మాట్లాడుతూ.. కడపలో బీజేపీ రణభేరి సభ పెట్టి మరోసారి రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, కడపలో బీజేపీ పార్టీ పెట్టిన సభ లాలూచీ, కుస్తీ సభ అని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ 5 ఏళ్ళు ప్రకటిస్తే దాన్ని బీజేపీ అమలు చేయలేదన్నారు. బీజేపీ…
కడపలో ఈ రోజు రాయలసీమ రణభేరి సభ నిర్వహించేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. సీమలో పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు రణభేరి సభకు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ వేదికపై రాయలసీమ అభివృద్ధి, ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టు సాధన కోసం వరుస ఆందోళనలు చేపట్టే దిశగా కార్యాచరణ ప్రకటించనున్నారు. రాయలసీమ విషయంలో తమ పార్టీ వైఖరి ఏమిటో మరోసారి స్పష్టం చేయనున్నారు. రాయలసీమ రణభేరి సభలో పెండింగ్ ప్రాజెక్టులు, రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని…
ఏపీలో జగన్ సర్కార్ తీరుపై బీజేపీ నేతలు అస్త్రాలు ఎక్కుపెడుతూనే వున్నారు. ఏపీలో దిశ, దశ లేని ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేన మాత్రమే. రెండు నెలల క్రితమే అమిత్ షా మాకు ఈ విషయం పై దిశానిర్దేశం చేశారు. వలంటీర్ వ్యవస్థతో ప్రజాస్వామ్య వ్యవస్థను సీఎం నాశనం చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ ద్వారా…
ఏపీ బడ్జెట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోందని ఆయన కామెంట్ చేశారు. అప్పులు పెట్టిన జగన్ ఎందుకు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. అప్పులు ఎగ్గొట్టడానికా అంటూ ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏ ప్రాంతం అభివృద్ధి గురించి ప్రస్తావనే లేదని ఆరోపించారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఎందుకు కేటాయించలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. మసిపూసి…
ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తావన లేదు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదు. మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇది. బడ్జెట్ ను…
బీజేపీ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరయ్యారు ఫొటో గ్రాఫర్లు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని మోడీ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేందుకు మోడీ పాలనే కారణం. రష్యా, ఉక్రెయిన్ యుద్దం పెద్ద ఎత్తున జరుగుతుంది. వారి మధ్యలో మధ్యవర్తిత్వం నిర్వహించే…
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన… ఆయన సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజులా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.. శ్రీశైలంలో శివలింగం పెకిలించారని సోము వీర్రాజు విమర్శిస్తున్నారు, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించండి అంటూ సవాల్ చేశారు… శ్రీశైలం అభివృద్ధి ఎవరి టైంలో జరిగిందో చర్చకు సిద్ధం..? సోము వీర్రాజు సిద్ధమా..? అంటూ ఛాలెంజ్ విసిరారు శిల్పా చక్రపాణి…