ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అవగాహన కల్పించేందుకు ఏపీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ పర్యటించారు. అయితే నేడు గాన కోకిల లతా మంగేష్కర్ మరణించిన నేపథ్యంలో ఆమె మృతిపట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నేతలు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ మరణం దేశానికి తీరని లోటని ఆయన అన్నారు.
తాజా కేంద్ర బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉందని ఆయన అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ రూపొందించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా క్షేమం కోసం రాజకీయాలకు అతీతీతంగా బడ్జెట్ ను రూపొందించారని ఆయన వెల్లడించారు. తాయిలాలు ఇవ్వలేదు.. భవిష్యత్తు అవసరాల ప్రకారం నిర్దేశించారని ఆయన తెలిపారు. బడ్జెట్టును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మేధావులతో చర్చ కార్యక్రమాలు పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు.