చాలాకాలం క్రితమే వాట్సప్ ‘డిజప్పియరింగ్ మెసేజెస్’ (Disappearing Messages) ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే! ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే.. పరిమిత కాలంలో ఆటోమెటిక్‌గా మెసేజెస్ డిలీట్ అయిపోతాయి. 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు అంటూ గడువు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మూడింటిలో ఏదైనా ఒక సమయం సెలెక్ట్ చేస్తే.. సరిగ్గా ఆ గడువు ప్రకారం సింగిల్ చాట్స్‌లో గానీ, గ్రూప్స్‌లో గానీ మెసేజెస్ డిలీట్ అవుతాయి. కాకపోతే.. దీని వల్ల ఒక చిన్న సమస్య ఉంది. ముఖ్యమైన మెసేజ్‌లు సేవ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉండదు. గడువు ప్రకారం, ఇంపార్టెంట్ మెసేజ్‌లు మాయమైపోతుంటాయి.
ఈ సమస్యకి వాట్సప్ ఇప్పుడు పరిష్కారం కనిపెట్టింది. అవతల వ్యక్తి డిజప్పియరింగ్ మెసేజ్ ఫీచర్‌ని ఎనేబుల్ చేసినా, అది డిలీట్ కాకుండా ఆపొచ్చు. ఇప్పటికే వాట్సప్ బీటా యూజర్లు ఈ ఫీచర్‌ని టెస్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్‌లో ‘కెప్ట్ మెసేజెస్’ (Kept Messages) పేరుతో కొత్తగా ఓ సెక్షన్ కనిపిస్తుంది. ఆ సెక్షన్‌లో యూజర్ సేవ్ చేసిన మెసేజెస్ కనిపిస్తాయి. దీని వల్ల ముఖ్యమైన సమాచారం, మెసేజెస్, అడ్రస్‌లు, ఫోన్ నెంబర్స్ లాంటివి డిలిట్ కాకుండా జాగ్రత్తపడొచ్చు. అయితే.. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నదే ఇంకా స్పష్టత లేదు.