ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఫొటో ఇప్పుడు చర్చగా మారింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి అమర్‌నాథ్ రెడ్డి కలిసి ఉన్న ఫొటో.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, పవన్‌పై అమర్‌నాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఇది నెట్టింట్లో ప్రత్యక్షమై తెగ తిరిగేస్తోంది.. ఇక, మంత్రిపై అమర్‌నాథ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. పవన్‌పై ఇంతలా విరుచుకుపడే నీవు.. ఆయనతో కలిసి ఫొటో ఎందుకు తీయించుకున్నావు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.. అయితే, సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంపై స్పందించారు మంత్రి.. మిగిలిన వాళ్లలాగా పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు అని నేను అనను.. సీఎం వైఎస్ జగన్ నాకు ఇచ్చిన ఇమేజ్ కారణంగా నాతో చాలా మంది ఫోటోలు దిగుతారని.. పవన్ కల్యాణ్ కూడా అదే విధంగా చేసి ఉండొచ్చన్నారు. కాగా, గతంలో ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్-అమర్‌నాథ్ తీసుకున్న ఫోటోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.