ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్‌లో రోడ్డుపై వెళ్తోంది. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. కొంత సేపు వాదించుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజాభివృద్ధికి వారిని సిద్ధం చేస్తారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఓ ఉపాధ్యాయుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. ప్రస్తుతం అతడి వీడియో వైరల్ అవుతోంది. ఓ విద్యార్థినికి చెందిన కుటుంబీకులు ఉపాధ్యాయుడిని కొట్టడం వీడియోలో చూడొచ్చు. తొమ్మిదో తరగతి విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపినందుకు ఉపాధ్యాయుడిని కొట్టినట్లు సమాచారం.
డీప్ ఫేక్‌లను అడ్డుకోడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు ఇన్ బిల్ట్ ఆల్గారిథమ్ తీసుకురారావాలని.. డీప్ ఫేక్ ల వల్ల విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు కోసం వినియోగిస్తున్నారని ప్రముఖ పాత్రికేయుడు, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో డేటా సైన్స్ సమిట్ కార్యక్రమంలో మాట్లాడారు. ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, ఏఐ నిపుణులు నవంబర్…
సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఫిషింగ్ లింక్‌లు కూడా వైరల్ అవుతాయి. ఈ లింక్‌లను క్లిక్ చేయడం వలన వినియోగదారులకు సమస్యలు పెరుగుతాయి. అలాంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రధానమంత్రి ఉచిత రీఛార్జ్ పథకం కింద.. భారతీయ వినియోగదారులందరికీ 3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్ లభిస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ 30లోపు ఈ రీఛార్జ్‌ని పొందండని రాసుకొచ్చారు. పోస్ట్‌తో పాటు లింక్ కూడా షేర్…
Puspa 2 Movie Event: కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. భారతదేశంలోని సినీ పరిశ్రమలు ఎంతో ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి పుష్ప 2. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ శరవేగంగా చాలా జోరుగా సాగుతున్నాయి. మరోవైపు సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నారు మూవీ మేకర్స్. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా నుండి వచ్చిన పాటలు హల్చల్…
పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భరతనాట్యం చేస్తున్న ఇద్దరు బాలికల వెనుక ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు అమ్మాయిలు కెమెరా ముందు క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నారు. వారితో పాటు అమ్మాయిల వెనక నిలబడి ఉన్న ఏనుగు డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. కేవలం మనుషులు మాత్రమే సంగీతాన్ని ఆస్వాధించడం కాదు.. పెంపుడు జంతువులు కూడా సంగీతాన్ని ఆస్వాధిస్తాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
Social Media: చిన్న పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఓ చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఈరోజు (బుధవారం) ఆమోదం తెలిపింది.
దివ్వెల మాధురి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సోషల్ మీడియాలో తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులపై దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం టెక్కలి సీఐ శ్రీనివాస్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.