ఇది కలియుగం. ప్రస్తుతం సాధారణ పనుల నుంచి వివాహాల వరకు అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. అలాగే ఓ జంట తమ పెళ్లిని విభిన్నంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని భావించింది. వెడ్డింగ్ కార్డ్‌ను ఆకర్శణీయంగా మలచింది. పెళ్లి పత్రికను మొదటిసారి చూసినప్పుడు ఓ ఆధార్ కార్డులా కనిపించింది. అయితే తర్వాత సరిగ్గా చూసేసరికి అది పెళ్లి కార్డు అని తెలిసింది.
READ MORE: YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కడప కార్పొరేషన్‌లో ఏడుగురు కార్పొరేటర్లు జంప్!
ఇలాంటి పెళ్లి పత్రికను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఇది పూర్తిగా ఆధార్ కార్డ్ లాగా కనిపిస్తుంది. దీని ఫాంట్ స్టైల్ లేఅవుట్ పూర్తిగా అధికారిక ఆధార్ కార్డ్ లాగానే రూపొందించారు. పెళ్లి కార్డును పరిశీలిస్తే అది మధ్యప్రదేశ్‌లోని పిపారియా గ్రామానికి చెందిన వరుడు ప్రహ్లాద్, వధువు వర్షల పెళ్లి కార్డు అని తేలింది. సాధారణ ఆధార్ నంబర్‌కు బదులుగా, వారి వివాహ తేదీని కార్డ్‌లో రాశారు. ఫోటో స్థానంలో వధూవరులు కలిసి ఉన్న ఫోటోను అమర్చారు. ఇది కాకుండా.. కింద బార్‌కోడ్ కూడా తయారు చేశారు. ఇది జూన్ 22, 2017 నాటి పత్రిక. అయితే ఈ పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE:Horror movie: 6 లక్షలతో తీసిన 86 నిమిషాల సినిమా.. రూ. 800 కోట్లు రాబట్టింది.. మూవీ పేరు?
అయితే.. సోషల్ మీడియాలో ఈ కార్డ్ ఫోటోపై ప్రజలు భిన్నంగా స్పందించారు. “ఇది చాలా భిన్నంగా ఉంది.” అని ఓ వినియోగదారు కామెంట్ చేశారు. పిల్లల కోసం కొత్త ఆధార్ కార్డులు తయారు చేసేవారు. ఇప్పుడు పెళ్లికి కూడా ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారు. అని మరో వినియోగదారు రాసుకొచ్చారు. ఆధార్ కార్డ్ పద్ధతిలో పెళ్లి పత్రికను తయారు చేయడం అస్సలు సరైంది కాదని మరో వినియోగదారు తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.