Naga Chaitanya Wedding Card: డిసెంబర్ 4న జరగబోయే వివాహ కార్యక్రమానికి సంబంధించి అక్కినేని ఇంట్లో పెళ్లి పనుల హడావిడి మొదలైంది. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య డిసెంబర్ 4న శోభిత దూళిపాళ్లతో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఇకపోతే, ఈ వివాహానికి సంబంధించిన శుభలేఖలను పంచడం మొదలుపెట్టింది అక్కినేని కుటుంబం. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకుల ప్రముఖులను అలాగే బంధుమిత్రులను వివాహానికి తప్పకుండా…
Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి ఏ ఒక్క భారతీయుడికి పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఎన్నో ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్ పతి షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ జరుగుతోంది. ఈ షోకి ఇప్పటికే అనేకమంది సినీ తారలు హాజరయ్యారు. అయితే, తాజాగా ఓ ఎపిసోడ్లో ఓ అమ్మాయి రాగా.. మతాల సందర్బంగా తనకు తైక్వాండో వచ్చు అంది. దాంతో వెంటనే…
Dhananjaya Engagement: కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన ‘ధనంజయ’ అంటే తెలుగు సినీ అభిమానులు అంత త్వరగా గుర్తు పట్టకపోవచ్చు. అదే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విలన్ ‘జాలిరెడ్డి’ అనండి అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు. పుష్ప సినిమాలో ‘జాలిరెడ్డి’ గా ఆయన ఆకట్టుకున్నాడు. ఇకపోతే, ప్రస్తుతం ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాత, రచయితగా కూడా బిజీబిజీగా ఉన్నారు. ధనంజయ ప్రస్తుతం సత్యదేవ్ తో కలిసి ‘జీబ్రా’ సినిమాలో మంచి రోల్…
Lions Attack Cow:గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని 11 తాలూకాల్లో సింహాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తరుచుగా వేట కోసం తరచూ వచ్చి వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నాలుగు సింహాలు రాత్రి వేట కోసం జిల్లాలోని రాజులాలోని పిపావావ్ పోర్ట్ ప్రాంతానికి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రి వేటలో వెతుకులాటకు బయలుదేరిన సింహాలు ఎద్దును వేటాడేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఎద్దు సింహాలను ఎదుర్కొంది. అంతేకాదు…
Javier Aguirre: హోండురాస్‌తో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ నార్త్, సెంట్రల్ అమెరికా అండ్ కరేబియన్ అసోసియేషన్ ఫుట్‌బాల్ (CONCACAF) నేషన్స్ లీగ్ క్వార్టర్ ఫైనల్స్‌లో మెక్సికో ప్రధాన కోచ్ జేవియర్ అగ్యిర్ ఫుట్‌బాల్ హింసను ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత, 65 ఏళ్ల కోచ్ ప్రత్యర్థి ప్రధాన కోచ్ రేనాల్డో రుయెడాతో కరచాలనం చేసేందుకు టచ్‌లైన్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో స్టాండ్ నుండి విసిరిన డబ్బా కోచ్ తలకు తగిలి అతని గాయం రక్తస్రావం ప్రారంభమైంది.…
సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేల కొద్ది వీడియోలు వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని మిమ్మల్ని నవ్విస్తాయి. మరికొన్ని కోపాన్ని సృష్టిస్తాయి. కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి.
Licence Cancelled: ప్రమాదంలో ఉన్న రోగులను తరలించేందుకు అంబులెన్స్‌ను అడ్డుకున్న ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసారు. ఈ ఘటనలో అతడికి ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు ఫైన్ వేశారు ట్రాఫిక్ పాలీసులు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. డ్రైవర్ బాధ్యతారాహిత్యానికి పాల్పడినందుకు కేరళ పోలీసులు చేసిన పనికి వారికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో రద్దీగా ఉండే రోడ్డుపై కారు వెళ్తోంది.…
వ్యక్తుల ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా.. ఇటీవల పాకిస్థానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టిక్‌టాకర్ ఇమ్షా రెహ్మాన్ యొక్క ప్రైవేట్ వీడియోలు (MMS) వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా ఖాతాలను డీయాక్టివేట్ చేసింది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై.. ఏడాది మా పాలనపై చర్చకు మేం సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అన్నారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామని ఆయన తెలిపారు.
AP Legislative Council : ఏపీ శాసనమండలిలో ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదం సాగింది. ఈ సందర్భంగా, వైఎస్సార్సీపీ సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు కట్టిన చర్యలతో సభను అడ్డగించాలని వారు ప్రయత్నించారు. ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. “సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య పదజాలంతో…