సిద్దిపేట జిల్లా ములుగులో దారుణం వెలుగుచూసింది. పెళ్లైన 13 రోజులకే ఓ యువతి గర్భం దాల్చింది. భర్త నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఘటనలో సినిమా రేంజ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ యువతికి పెళ్లికి ముందే ఉదయ్ కిరణ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరో యువకుడు పవన్ కళ్యాణ్ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Also Read: Andhra Pradesh : ఏపీలో భారీ ఐటీ దాడులు..150 బంగారం బిస్కెట్లు, రూ.40 కోట్ల కాష్ స్వాధీనం!
ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. విషయం దాచిపెట్టి గత నెలలో మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఈ నెల 8న యువతికి కడుపునొప్పి రావడంతో యువతి భర్త ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి అప్పటికే గర్భవతి అని నిర్ధారించారు. దీంతో భర్త షాక్ కు గురయ్యాడు. అసలు ఏం జరిగిందని భార్యను అక్కడికక్కడే నిలదీశాడు. తనపై జరిగిన ఘోరాన్ని భర్తకు చెప్పింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.