Husnabad : మొంథా తుఫాన్ నిండా ముంచింది. రైతులకు చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసింది. ఇంకో రెండు రోజులైతే అమ్ముకుందాం.. డబ్బులొస్తాయి అని మురిసిన రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఆరుగాళం కష్టపడి రక్తం దారబోసి పంట పండిస్తే.. ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఊడ్చుకుపోయింది. ఎటు చూసినా రైతుల కన్నీళ్లే.. గుండెలు పిండేసే బాధలే.. ఈ హృదయవిదారకర ఘటన హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కనిపించింది. భీకర వర్షానికి మార్కెట్ యార్డులోకి భారీగా వాన నీళ్లు వచ్చి వడ్లు మొత్తం కొట్టుకుపోయి నాళాలో పడ్డాయి. ఒక్కటంటే ఒక్క వడ్ల గింజ కూడా చేతికి దక్కలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ యార్డులో ఏ మూలకు వెళ్లినా తలకు చేతులు పెట్టుకుని ఏడుస్తున్న రైతులే కనిపిస్తున్నారు.
Read Also : Telangana BJP : అజారుద్దీన్ కి మంత్రి పదవి.. ఫిర్యాదు చేయనున్న బీజేపీ
సిద్దిపేట కలెక్టర్ హైమావతి పంట నష్టాన్ని పరిశీలించేందుకు మార్కెట్ యార్డుకు రాగా.. రైతులు ఆదుకోవాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ మహిళారైతు నాళాలో కొట్టుకుపోయిన తన వరి ధాన్యాన్ని చూపిస్తూ కలెక్టర్ కాళ్ల మీద పడి ఏడ్చింది. తనను ప్రభుత్వమే ఆదుకోవలంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పంట నష్టం వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Read Also : Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు..