NBK107 సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి దసరాకే రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతూ వస్తోంది. చిత్రీకరణ కూడా గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతుండడంతో.. ఈ సినిమా దసరాకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు దసరాకి సినిమా రాకపోవచ్చని సమాచారం. ఇందుకు కారణం.. బాలయ్యకి కరోనా సోకడమే! ఇటీవల టెస్టులు నిర్వహించగా.. బాలయ్యకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది తదుపరి షెడ్యూల్స్‌పై కూడా ప్రభావం చూపింది. తద్వారా…
రీసెంట్‌గా ఖిలాడిగా ఆకట్టుకోలేకపోయిన రవితేజ.. ఈసారి రామారావుగా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామారావు అన్ డ్యూటీ’ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు ధమాకా..రావణాసుర.. టైగర్ నాగేశ్వరరావు.. సినిమాలు కూడా చేస్తున్నారు మాస్ మహారజా. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సెట్స్ పై ఉన్నాయి. అయితే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ 154వ సినిమాలోను.. కీలక పాత్రలో…
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి నటనను వారసత్వంగా చేసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి ఒక పక్క హీరోయిన్ గా మరోపక్క సింగర్ గా, ర్యాపర్ గా రాణిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ చేస్తోన్న ‘సలార్’పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరేమో బాహుబలి, మరొకరేమో కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబోలో ‘సలార్’ వస్తుండడంతో.. జాతీయంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడా అంచనాలు తారాస్థాయిలో పెంచే మరో క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్‌తో హీరో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడట! కేజీఎఫ్‌తో యశ్‌కి పాన్ ఇండియా క్రేజ్…
ప్రస్తుతం భారత చిత్రసీమలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘సలార్’ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ‘బాహుబలి’ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో.. నేషనల్ లెవెల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక పాత్రల కోసం ఏరికోరి మరీ క్రేజీ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఓ ప్రధాన పాత్ర కోసం…
మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న మెగా154 సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2023 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ‘జనవరి 2023,సంక్రాంతి కి కలుద్దాం’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. టైటిల్ తో పాటు టీజర్ త్వరలో విడుల చేస్తామంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, అందులో పడవలు కనిపిస్తుండగా చిరంజీవి చేతిలో లంగరుతో ఉన్న పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ…
భారత సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. జాతీయంగా అనూహ్యమైన క్రేజ్ గడించిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. పోస్టర్లతో ఊరిస్తోన్న ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆడియన్స్ ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. నిజానికి.. మే చివరి వారంలోనే ‘సలార్’ టీజర్ రావాల్సింది కానీ, షూటింగ్ ఆలస్యం అవ్వడంతో కుదరలేదు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్…
NBK107.. సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ఏంటా? అని చర్చలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడం టాలీవుడ్ ఆనవాయితీ. కాబట్టి, NBK107 ఫస్ట్ లుక్ రిలీజ్ టైంలో కచ్ఛితంగా టైటిల్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ, మేకర్స్ అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు. పవర్ఫుల్ పోస్టర్ని విడుదల చేశారే గానీ, టైటిల్ మాత్రం ప్రకటించలేదు. పోనీ, టీజర్ సమయంలో అయినా రివీల్ చేస్తారా అంటే,…
NBK107 మేకర్స్ శరవేగంగా కానిస్తున్న పనులు చూసి.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుని పురస్కరించుకొని జూన్ 10వ తేదీన ఏదైనా క్రేజీ అప్డేట్ రావొచ్చని అంతా అనుకున్నారు. అదే నిజమైంది. లేటెస్ట్గా యూనిట్ సభ్యులు ఇచ్చిన అప్డేట్ని బట్టి చూస్తే.. జూన్ 10న లేదా అంతకుముందు రోజే NBK107 టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ‘సింహం వేటకు సిద్ధం.. #NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్’ అనే క్యాప్షన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో..…