పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ చేస్తోన్న ‘సలార్’పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరేమో బాహుబలి, మరొకరేమో కేజీఎఫ్‌తో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబోలో ‘సలార్’ వస్తుండడంతో.. జాతీయంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడా అంచనాలు తారాస్థాయిలో పెంచే మరో క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్‌తో హీరో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడట! కేజీఎఫ్‌తో యశ్‌కి పాన్ ఇండియా క్రేజ్ రావడం, సలార్‌పై అంచనాలు భారీగా ఉండటంంతో పాటు తన మల్టీవర్స్ సాగాకి కలిసొస్తుందన్న ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ ఈ మాస్టర్ ప్లాన్ వేశాడట! యశ్‌ని రిక్వెస్ట్ చేయగానే, అతడు సైతం కేమియోలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. అయితే.. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం.. ప్రేక్షకాభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. థియేటర్లు సైతం దద్దరిల్లిపోవాల్సిందే!
కాగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సలార్‌లో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తోంది. ఒక కీలక పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నాడు. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అన్నట్టు.. ఈ సినిమాని కూడా కేజీఎఫ్ తరహాలో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఒకే సినిమాలో పూర్తి కథ చెప్పలేకపోవడం వల్లే ఇలా రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్టు తెలిసింది.