విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి నటనను వారసత్వంగా చేసుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి ఒక పక్క హీరోయిన్ గా మరోపక్క సింగర్ గా, ర్యాపర్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ప్రభాస్ సరసన సలార్, నందమూరి బాలకృష్ణ సరసన ఎన్బీకే 107 లో నటిస్తోంది. ఇక ఈ రెండు కాకుండా చిరు సరసన మెగా 154 లో కూడా ఛాన్స్ పట్టేసింది. స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మపై గత కొన్నిరోజుల నుంచి ఒక రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది గతంలో శృతి ఒక ఇంటర్వ్యూలో తాను పీసీఓఎస్ తో బాధపడుతున్నాని, దానికి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ వార్తను కొన్ని యూట్యూబ్ చానెళ్లు తమ లైకుల కోసం వాడుకొన్నాయి.
శృతి హాసన్ ఆరోగ్యం బాగోలేదని, ఆమె హాస్పిటల్ బెడ్ పై క్రిటికల్ కండీషన్ లో ఉందంటూ ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేయడంతో శృతి అభిమానులు ఆందోళన చెందియు ఆమెకు కామెంట్స్ పెడుతున్నారు. శృతి ఏమైంది..? నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించేస్తుండడంతో శృతి హాసన్ ఈ వార్తపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు. తాను బాగానే ఉన్నానని, ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నానని శృతి చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. “గత రెండు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగోలేదని, హాస్పిటల్ లో క్రిటికల్ కండీషన్ లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో.. షూటింగ్స్ బిజీలో ఉంటున్నాను. నాకు ఉన్న ప్రాబ్లెమ్ పీసీఓఎస్.. అది అందరి మహిళలో చాలా సాధారణమైన విషయం.. దానికోసం హాస్పిటల్ లో చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో కొంతమంది ఈ న్యూస్ ను తప్పదోవ పట్టిస్తున్నారు.. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.