Live-in partner: ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్స్ పెరుగుతున్నాయి. యువతీయువకులు సహజీవనం పేరుతో కలిసి ఉంటున్నారు. గతంలో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య సహజీవనం ఎంత ప్రమాదకరమో నిరూపించింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న యువతులు పలు కారణాలతో హత్యలకు గురయ్యారు.
Man Allegedly Chops Up Aunt's Body: ఓ వ్యక్తి అత్తను చంపేసి ముక్కలు ముక్కలుగా నరికి రోడ్డు పక్కన పడేశాడు. ఏం తెలియనట్లు తన అత్త కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇతని వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసు విచారణలో నిజం వెలుగులోకి వచ్చింది. అనుజ్ శర్మ అలియాస్ అచిత్య గోవింద్ దాస్(33) డిసెంబర్ 11న తన అత్త సరోజ్ శర్మ(65) సుత్తితో తలపై కొట్టి చంపాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి…
DNA of Shraddha's father matches with bones recovered from Mehrauli forest: శ్రద్ధా వాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోహ్రౌలి సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు దొరికన ఎముకలు శ్రద్ధా వాకర్‌వే అని తేలింది. పలు ప్రాంతాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి విశ్లేషణకు పంపారు. తాజాగా శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్ డీఎన్ఏతో ఎముకల డీఎన్ఏ మ్యాచ్ అయింది.
Woman hacked to death in public by partner in Kerala: లివ్ ఇన్ రిలేషన్ షిప్ మహిళల ప్రాణాలను తీస్తోంది. నమ్ముకున్నవారే నరికి చంపుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ ఉదంతమే. తాజాగా కేరళలో కూడా శ్రద్ధావాకర్ తరహాలోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న యువతిని ఆమె లవర్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం శివార్లలోని…
Maharashtra woman harassed by live-in partner: దేశవ్యాప్తంగా శ్రద్ధావాకర్ హత్య సంచలనం సృష్టించింది. అత్యంత కిరాతకంగా శ్రద్ధ సహజీవన భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా 35 ముక్కలుగా చేసి చంపేశాడు. ప్రస్తుతం ఈ కేసులో అఫ్తాబ్ ను పోలీసులు విచారించారు. పాలీగ్రాఫ్ టెస్టులో సంచలన విషయాలు వెల్లడించారు అఫ్తాబ్. శ్రద్ధా తనను విడిచి వేరేవాళ్లతో వెళ్లిపోతుందనే చంపేసి ముక్కలుగా చేశానని వెల్లడించాడు. శ్రద్ధాతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న సమయంలోనే మరో 20…
Key facts about Aftab in Shraddha Walker's murder case come to light: ఢిల్లీలో శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసులో క్రమక్రమంగా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధాని చంపేసి మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఇంట్లో ఓ ఫ్రిజ్ లో దాచాడు అఫ్తాబ్ పూనావాలా. అయితే ఇంట్లో శవాన్ని ఉంచుకునే కొత్త గర్ల్‌ఫ్రెండ్ ను ఫ్లాట్ కు తీసుకువచ్చి సరసాలు అడాడు. అయినా కూడా ఎలాంటి విషయం బయటకు పొక్కకుండా ఉన్నాడు. ప్రస్తుతం…
2020లో శ్రద్ధా వాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు ప్రారంభించామని, అయితే కేసును ఉపసంహరించుకోవాలని ఆమె వ్రాతపూర్వక ప్రకటన ఇవ్వడంతో కేసును మూసివేసినట్లు మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలిపారు. తనకు, అఫ్తాబ్ పూనావాలాకు మధ్య వివాదం పరిష్కరించబడిందని శ్రద్ధా వాకర్ కేసు వెనక్కి తీసుకుందని పోలీసులు వెల్లడించారు.