Woman hacked to death in public by partner in Kerala: లివ్ ఇన్ రిలేషన్ షిప్ మహిళల ప్రాణాలను తీస్తోంది. నమ్ముకున్నవారే నరికి చంపుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ ఉదంతమే. తాజాగా కేరళలో కూడా శ్రద్ధావాకర్ తరహాలోనే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న యువతిని ఆమె లవర్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగింది. తిరువనంతపురం శివార్లలోని వజ్హయిల సమీపంలో ఈ ఘటన జరిగింది.
Read Also: Bollywood: చిచ్చు రాజేసిన కాంతారా, పుష్ప కామెంట్స్.. స్టార్ డైరెక్టర్ల మధ్య ట్వీట్ వార్
వివరాల్లోకి వెళితే బాధితురాలు సింధు, నిందితుడు రాగేష్ సహజీవనం చేస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సింధు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైక్ పై వచ్చిన రాగేష్ కొడవలితో బహిరంగంగా నరికి చంపాడు. మొదటగా రాగేష్, సింధు మెడపై దాడి చేశాడు. ఈ దాడినుంచి కాపాడాలని కేకలు వేయడంతో, ఆమె తలపై దాడి చేశాడు. దీంతో సింధు అక్కడే కుప్పకూలిపోయింది. తీవ్రగాయాలో రక్తపు మడుగులో ఉన్న సింధుపై విచక్షణరహితంగా దాడి చేశాడు.
ఈ ఘటనను చూసిన స్థానికులు నిందితుడిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాల పాలైన సింధు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించింది. బాధితురాలు సింధు పలోడ్ సమీపంలోని నన్నిమోడుకు చెందిన వ్యక్తి కాగా.. నిందితుడు రాగేష్ కిలిమనూర్ కు చెందిన వాడు. వీరిద్దరికి కుటుంబాలు ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సింధు తనకు దూరం అవుతుందనే అనుమానంతోనే రాగేష్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.