Maharashtra woman harassed by live-in partner: దేశవ్యాప్తంగా శ్రద్ధావాకర్ హత్య సంచలనం సృష్టించింది. అత్యంత కిరాతకంగా శ్రద్ధ సహజీవన భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా 35 ముక్కలుగా చేసి చంపేశాడు. ప్రస్తుతం ఈ కేసులో అఫ్తాబ్ ను పోలీసులు విచారించారు. పాలీగ్రాఫ్ టెస్టులో సంచలన విషయాలు వెల్లడించారు అఫ్తాబ్. శ్రద్ధా తనను విడిచి వేరేవాళ్లతో వెళ్లిపోతుందనే చంపేసి ముక్కలుగా చేశానని వెల్లడించాడు. శ్రద్ధాతో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న సమయంలోనే మరో 20 మంది హిందూ మహిళలతో సంబంధాలు నెరిపినట్లు వెల్లడించాడు.
ఇదిలా ఉంటే శ్రద్ధా మరణం తర్వాత మరో యువతికి ఇలాంటి బెదిరింపులే ఎదురయ్యాయి. మహారాష్ట్రకు ధులేకు చెందిన ఓ యువతి కొనేళ్లుగా అర్షద్ సలీం మాలిక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. అయితే అతను వేధించడంతో విడిపోదాం అనుకున్న మహిళ బెదిరించాడు సలీం మాలిక్. శ్రద్ధాను 35 ముక్కలుగానే చేశాడు నిన్ను 70 ముక్కలుగా నరికేస్తా అంటూ బెదిరించాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also: Football Player: గుండెపోటుతో కుప్పకూలి యువ ఆటగాడు కన్నుమూత
అత్యాచారం.. మతమార్పిడి:
అర్షద్ సలీం మాలిక్ తనను వేధిస్తున్నాడంటూ సదరు మహిళ ఆరోపించింది. నవంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021 నుంచి యువతి సలీంమాలిక్ తో సహజీవనం చేస్తుంది. అయితే సదరు మహిళకు అంతకుముందే వివాహం అయింది. 2019తో భర్త చనిపోయాడు. 2017లో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమెను సలీం మాలిక్ ను కలుసుకుంది. అయితే సలీం మాలిక్ తనను తాను హర్షద్ మాలి అనే మారు పేరుతో పరిచయం చేసుకున్నాడు.
ఈ క్రమంలో ధులేలోని లాలింగ్ గ్రామంలో అడవిలోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. కాగా.. ఈ క్రమంలోనే హర్షల్ అసలు పేరు అర్షద్ సలీం మాలిక్ గా గుర్తించింది. అనంతరం ఆమెను ఉస్మానాబాద్ తీసుకెళ్లాడు సలీం మాలిక్. మాలిక్ తనని బలవంతంగా మతం మార్చాడాని.. తన బిడ్డ మతం మార్చడానికి ప్రయత్నించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాలిక్ తండ్రి కూడా తనను దారుణంగా వేధించాడని వెల్లడించింది. ఈ క్రమంలోనే వీరికి ఈ ఏడాది ఆగస్టులో బిడ్డ జన్మించింది. ఆ సమయంలో కూడా సలీం మాలిక్ మహిళపై వేధింపులు కొనసాగించాడు. కొన్ని సార్లు సైలెన్సర్ లో శరీరాన్ని కాల్చే వాడని ఫిర్యాదు చేసింది. శ్రద్ధాను 35 ముక్కలుగా నరికేశాడు.. నేను 70 ముక్కలుగా నిన్ను నరికేస్తానని బెదిరించినట్లు మహిళ ఫిర్యాదు చేసింది.