తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టు అనంతరం అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మెగా ఈవెంట్ లో వరుసగా మూడు విజయాలు సాధించి మంచి జోష్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఇవాళ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.
ఐపీఎల్-2023లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్ ను ఢీ కొట్టేందుకు ధావన్ సేన సన్నదమవుతుంది. పవర్ హిట్టర్.. ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్ స్టోన్ రాకతో పంజాబ్ కింగ్స్ లో జోష్ వచ్చింది.
ఐపీఎల్ 2023 సీజన్ లో గత రెండు రోజులలో జరిగిన మ్యాచ్ ల్లో సీనియర్ ఆటగాళ్లు సత్తా చాటి.. అదిరిపోయే కమ్ బ్యాక్ చేస్తున్నారు. ఎవరూ ఊహించనట్టుగా.. ఎలాంటి అంచనాలు లేని సీనియర్లు.. బ్యాటు. బాల్ తో మెరిసి మ్యాజిక్ చేస్తున్నారు. దీంతో 2023లో కమ్ బ్యాక్ ఇయర్ గా అభివర్ణిస్తున్నారు.
ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(99) ఒంటరి పోరాటంతో పంజాబ్ 143 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2023లో భాగంగా 14వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్ కెరీర్లోనే శిఖర్ ధావన్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.