ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సొంతం చేసుకోవడంతో పాటు పలు రికార్డులు కూడా నమోదు చేసింది. ఇంగ్లండ్‌పై తొలిసారి పది వికెట్ల తేడాతో, అది కూడా అతి తక్కువ ఓవర్లలోనే విజయం సాధించిన జట్టుగా.. భారత చరిత్రపుటలకెక్కింది. బౌలర్లైన బుమ్రా, షమీలు సైతం తమ ఖాతాలు రికార్డ్స్ వేసుకున్నారు. ఇక బ్యాటింగ్ విషయంలో రోహిత్ శర్మ – శిఖర్ ధావన్ ద్వయం కూడా ఓ అరుదైన ఫీట్ సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన…
ద ఒవల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ కుదిర్చిన స్వల్ప లక్ష్యాన్ని (111) ఒక్క వికెట్ కోల్పోకుండానే భారత్ చేధించింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ (76*), శిఖర్ ధవన్ (31*).. తొలుత ఆచితూచి ఆడారు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదడంతో.. 18.4 ఓవర్లోనే భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోయి ఆడాడు. తొలుత టాస్…
ఈమధ్య సీనియర్ ఆటగాళ్లకు సెలెక్టర్లు తరచూ విశ్రాంతినిస్తున్నారు. తీరిక లేకుండా ఆడుతున్నారనో లేక ఫామ్ లేరన్న కారణాన్ని చూపి, సీనియర్స్‌కు రెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు జులై 22 నుంచి ప్రారంభం కానున్న విండీస్ టూర్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చారు. దీనిపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. విశ్రాంతి ఇస్తే, ఏ ఆటగాడూ ఫామ్‌లోకి తిరిగి రాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రోహిత్…
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని గబ్బర్ భార్య ఆయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. అయితే ఆయేషా ముఖర్జీకి ఇది రెండోసారి విడాకులు కావడం. ధావన్ కంటే ముందు ఒక్కరిని పెళ్లి చేసుకున్న ఆయేషా తనతో విడాకులు తీసుకోగా… 2012 సంవత్సరంలో ధావన్-ఆయేషా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్క అబ్బాయి ఉన్నాడు. అతని పేరు జోరవర్ ధావన్. గత ఏడాది విధించిన లాక్ డౌన్ సమయంలో కొడుకుతో…
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుకు శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా, భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. అయితే బీసీసీఐ తనను టీమిండియా కెప్టెన్‌గా నియమించడం పై సోషల్ మీడియా వేదికగా శిఖర్ ధావన్ స్పందించాడు. తన ట్విట్టర్ లో “దేశానికి నాయకత్వం వహించడం గొప్పగా భావిస్తున్నా. మీ అందరి విషెస్‌కు ధన్యవాదాలు” అని ధావన్ ట్వీట్ చేశాడు. అయితే ధావన్ మొదటి సారి జట్టును నడిపించబోతున్నాడు.…
ప్రస్తుతం టీం ఇండియా మొదటి జట్టు ఇంగ్లండ్ లో ఉన్న న్యూజిలాండ్‌తో టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో.. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీపడనుండగా రెండో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అయితే ఈ రెండో జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీఎంపిక చేసింది. లంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు. ఇక ఐపీఎల్ లో సత్తా…
భారత జట్లలో కోహ్లీ సారధ్యంలోని ఒక్క జట్టు టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ అలాగే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుండగా.. మరో జట్టు శ్రీలంక పర్యటనలకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ప్లాన్ చేసింది. శ్రీలంక పర్యటనలో భారత్ జులై 13 నుంచి 27 వరకూ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే లంకకు వెళ్లే జట్టుకు కెప్టెన్ రేసులో మొదటగా శిఖర్ ధావన్, హార్దిక్…