Punjab Kings Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలవగా ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు లక్నో జట్టు రంగంలోకి దిగింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు చొప్పున మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లు.. నాలుగింటిలో విజయాలు సాధించాయి. అయితే.. రన్ రేట్ పుణ్యమా అని పాయింట్ల పట్టికలో లక్నో నాలుగో స్థానంలో ఉండగా, పంజాబ్ జట్టు ఆరో స్థానంలో ఉంది. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్.. ఈ మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగుతున్నాడు.
Shweta Death Case: శ్వేత మృతికి కారణం అదే..! షాకింగ్ విషయాలు బయటపెట్టిన సీపీ
కాగా.. ఇదివరకే ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో.. రెండు వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు గెలుపొందింది. దీంతో.. ఈసారి తాము విజయం సాధించి, పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న పగతో లక్నో జట్టు బరిలోకి దిగుతోంది. అటు.. పంజాబ్ జట్టు కూడా టాప్-4లో స్థానం సంపాదించాలన్నా, రన్ రేట్ మెరుగుపరచుకోవాలన్నా.. గెలుపు తప్పనిసరి. ఇకపై జరుగుతున్నవన్నీ అత్యంత కీలకమైన మ్యాచ్‌లు కాబట్టి.. ఈ ఇరు జట్లకి ఈ మ్యాచ్ ప్రధానంగా మారింది. దీంతో.. ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ ఇరు జట్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించగలవు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఈ రెండూ బాగా రాణించగలవు. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
West Godavari Crime: మారిపోయానన్నాడు.. ఇంటికి తీసుకొచ్చి క్రూరంగా చంపాడు