ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ జట్టు అనంతరం అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ మెగా ఈవెంట్ లో వరుసగా మూడు విజయాలు సాధించి మంచి జోష్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో ఇవాళ పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Viral : వీళ్ల ఆనందం తగలెయ్యా.. అంత ఎత్తులో ఆ డ్యాన్సులేంటి ?
ఇవాళ పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్ లోడ్ దృష్ట్యా రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ మెగా టోర్నీమెంట్ లో భాగంగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ.. పియూష్ చావ్లా స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలోకి దిగాడు. రోహిత్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ చేయాలని ముంబై మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : Sai Prasad Reddy: లోకేష్‌కి ఇదే నా సవాల్.. నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై
కాగా రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకోనున్నట్లు ఈ టోర్నమెంట్ ఆరంభానికి ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇక పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ కు ముంబై స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అతను పూర్తి ఫిట్ నెస్ సాధించి.. ప్రస్తుతం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఆడిన 6 మ్యాచ్ ల్లో మూడు ఓటములు.. మూడు విజయాలతో ముందుకు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.