ఐపీఎల్ 2023 సీజన్ లో గత రెండు రోజులలో జరిగిన మ్యాచ్ ల్లో సీనియర్ ఆటగాళ్లు సత్తా చాటి.. అదిరిపోయే కమ్ బ్యాక్ చేస్తున్నారు. ఎవరూ ఊహించనట్టుగా.. ఎలాంటి అంచనాలు లేని సీనియర్లు.. బ్యాటు. బాల్ తో మెరిసి మ్యాజిక్ చేస్తున్నారు. దీంతో 2023లో కమ్ బ్యాక్ ఇయర్ గా అభివర్ణిస్తున్నారు. అజింకా రహానే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు సమవుజ్జీగా టీమిండియాలో వెలుగొందారు.. అజింకా రహానే 2022 నుంచి టీమిండియాలో చోటు కోల్పోయాడు. 2021 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రహానేని పక్కనబెట్టగా 2022 సీజన్ మధ్యలో రహానే గాయపడి.. టీమ్ కి దూరమయ్యాడు. బేస్ ప్రైజ్ కి సీఎస్కే లోకి వచ్చిన రహానే, ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెలరేగాడు. 225.93 స్ట్రైక్ రేట్ తో 61 పరుగులు చేసిన రహానే.. 2023 సీజన్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టాడు.
Also Read : IPL 2023 : దుమ్మురేపిన రింకూ సింగ్.. రెచ్చిపోయిన ఇంపాక్ట్ ప్లేయర్
2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు దూరమైన విజయ్ శంకర్ 2019 నుంచి 2021 వరకూ సన్ రైజర్స్ హైదరాబద్ టీమ్ లో ఉన్నాడు. ఒకటి రెండు మ్యాచ్ లు తప్ప మిగిలిన మ్యాచ్ ల్లో రెగ్యూలర్ గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. గత సీజన్ లో కూడా ఫెయిల్ అయిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ విజయ్ శంకర్.. కేకేఆర్ తో మ్యాచ్ లో 24 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 63 పరుగుల సునామీ ఇన్సింగ్స్ ఆడాడు. ఇక వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ 2021 సీజన్ సెకండ్ ఫేజ్ లో వెలుగులోకి వచ్చిన ఆల్ రౌండర్. కేకేఆర్ ని ఒంటి చేత్తో ప్లే ఆఫ్స్ కి చేర్చాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అక్కడ పెద్దగా ఆకట్టుకోలేక టీమ్ కు దూరమయ్యాడు. శుబ్ మన్ గిల్ ని వదిలేసి వెంకటేశ్ అయ్యర్ ని కేకేఆర్ రిటైన్ చేసుకుంది. అయితే గత సీజన్ లో అట్టర్ ప్లాప్ అయిన వెంకటేశ్ అయ్యర్, గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో 40 బంతుల్లో 83 పరుగులు చేశాడు.
Also Read : Virupaksha: డేట్ లాక్ అయ్యింది… ఇంతకీ చీఫ్ గెస్ట్ ఎవరు?
పేలవ ఫామ్ తో మూడు ఫార్మాట్లలో టీమిండియాకు దూరమైన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. బ్రిస్బేన్ టెస్టులో సంచలన పర్ఫామెన్స్ ఇచ్చి.. టీమిండియాకి కీ ప్లేయర్ గా మారాడు. 2022.23 ఏడాదిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 29 బంతుల్లో 9 ఫోర్లు,3 సిక్సులతో 68 పరుగులు చేశాడు. శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యంగ్ ప్లేయర్ల కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన బ్యాటర్ శిఖర్ ధావన్. అయితే ఐపీఎల్ 2023 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున సంచలన ప్రదర్శన చేస్తున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒంటరి పోరాటంతో 66 బంతుల్లో 99 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ చేశాడు. 2018లో ముంబై ఇండియన్స్ తరపున ఆరంగేట్రం చేసిన మయాంక్ మర్కండే.. ఐపీఎల్ లో తీసిన మొదటి వికెట్ ఎంఎస్ ధోనిది.. ఆ సీజన్ లో 15 వికెట్లు తీసిన మయాంక్ మర్కండే 2019 సీజన్ లో గాయంతో 3 మ్యాచ్ లే ఆడాడు. ఆ తర్వాత 2020లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని మయాంక్ 2021 సీజన్ లో ఒక్క మ్యాచ్.. 2022లో రెండు మ్యాచ్ లు ఆడాడు. ఆ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు.