MI vs PBKS: ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్.. 10 ఓవర్లలో పంజాబ్ స్కోరు ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab Kings Scored 78 Runs In First 10 Overs Against Mumbai Indians: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో, పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో.. పంజాబ్ స్కోరు నిదానంగా ముందుకు కదులుతోంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి.. పంజాబ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. అయితే.. పంజాబ్‌లో పరుగుల సునామీ సృష్టించగల విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు కాబట్టి, తర్వాతి 10 ఓవర్లలో లెక్కలు మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ పంజాబ్ బ్యాటర్లు విజృంభిస్తే.. 200 పరుగుల మైలురాయి దాటే ఆస్కారం ఉంది. అంత భారీ స్కోరు రాకుండా ఉండాలంటే.. తొలి 10 ఓవర్ల తరహాలోనే ముంబై బౌలర్లు మాయాజాలం పరచాలి. పంజాబ్ బ్యాటర్లకు భారీ షాట్లు కొట్టే అవకాశం ఇవ్వకుండా గందరగోళానికి గురి చేయాలి. మరి.. తర్వాతి 10 ఓవర్లు ఎలా ఉంటాయో చూడాలి.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో ఈడీ తప్పిదం.. ఆప్ నేతకు క్షమాపణలు
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..

క్రీజులోకి అడుగుపెట్టిన మొదట్లోనే పంజాబ్ జట్టుకి షాక్ తగిలింది. ప్రభ్‌సిమ్రన్ (7 బంతుల్లో 9) 13 పరుగుల వద్ద కీపర్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన మాథ్యూ షార్ట్‌తో కలిసి.. కెప్టెన్ శిఖర్ ధవన్ (20 బంతుల్లో 5 ఫోర్ల సహకారంతో 30) తన జట్టు స్కోరుని ముందుకు నడిపించాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ.. అనుకూలమైన బంతులు దొరికినప్పుడల్లా విరుచుకుపడుతూ వచ్చారు. శిఖర్ ఇలా చెలరేగిపోదామని అనుకున్న తరుణంలో.. స్టంప్ ఔట్ అయ్యాడు. 62 పరుగుల వద్ద అతడు పెవిలియన్ చేరాడు. శిఖర్ ఔట్ అయినప్పటి నుంచి పంజాబ్ జోరు కొంచెం తగ్గింది. మాథ్యూ షార్ట్ తన దూకుడు తగ్గించుకోగా.. లియాన్ లివింగ్‌స్టన్ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ముంబై బౌలర్ల విషయానికొస్తే.. అర్షన్ ఖాన్, పియూష్ చావ్లా చెరో వికెట్ పడగొట్టారు.
Naga Chaitanya: పెళ్ళయ్యాక యావరేజ్ గా ఉన్నాడు.. విడాకులు తీసుకున్నాక ఏంటిరా ఇంత అందంగా ఉన్నాడు
తాజావార్తలు
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!