Mumbai Indians Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా బుధవారం సాయంత్రం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఇదివరకే ఈ ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 22వ తేదీన మ్యాచ్ జరగ్గా.. అందులో ముంబైపై పంజాబ్ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తమ హోమ్‌గ్రౌండ్‌లో తమనే పంజాబ్ జట్టు ఓడించింది కాబట్టి.. ఇప్పుడు వారి హోమ్‌గ్రౌండ్‌లో ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Ukraine: క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడితో ఎలాంటి సంబంధం లేదు.. ఉక్రెయిన్ ప్రకటన
అటు.. పాయింట్ల పట్టికలోనూ ఈ ఇరుజట్లు టాప్-4 ప్లేస్‌లో లేవు. పంజాబ్ ఐదు విజయాలతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై నాలుగు విజయాలతో ఏడో స్థానంలో ఉంది. ఈ ఇరుజట్లకి ప్లేఆఫ్స్ ఆశలు ఉన్నాయి కానీ.. టాప్-4లో చోటు దక్కించుకోవాలంటే మాత్రం, విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా.. ముంబై జట్టు ఇప్పటివరకే నాలుగు విజయాలే నమోదు చేసింది కాబట్టి, ప్లేఆఫ్స్‌లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. అయితే.. ముంబై జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నప్పటికీ, అందరూ నిలకడగా రాణించడం లేదు. గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్‌లు మాత్రమే ప్రతీసారి సత్తా చాటుతూ.. తమ జట్టుకి పునాదుల్లా నిలిచారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. సూర్యకుమార్ ఈమధ్య ఫామ్‌లోకి తిరిగొచ్చిన విషయం మంచి పరిణామమే కానీ, దాన్ని తదుపరి మ్యాచ్‌ల్లో కొనసాగిస్తాడా? లేదా? అన్నది సందిగ్ధతగా మారింది. బౌలింగ్ విభాగం కూడా అంత పటిష్టంగా లేదు.
CSK vs LSG: వర్షం కారణంగా చెన్నై, లక్నో జట్ల మధ్య మ్యాచ్ రద్దు
పంజాబ్ జట్టు మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. ఏడుగురు స్ట్రాంగ్ బ్యాటర్లు ఉన్నారు. ఒకరు విఫలమైనా.. మరొకరు సత్తా చాటగలరు. కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంలోనూ పంజాబ్‌కి తిరుగులేదు. అలాంటి ఈ జట్టుపై ముంబై విజయం సాధించాలంటే.. తప్పకుండా అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. ఇప్పుడు పంజాబ్ మొదట బ్యాటింగ్ ఆడుతోంది కాబట్టి.. కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, తక్కువ స్కోరుకే పరిమితం చేయగలగాలి. ఒకవేళ భారీ స్కోరు ఇస్తే మాత్రం.. అప్పుడు ముంబైకి బ్యాటర్లే దిక్కు అవుతారు. మరి.. ఈ మ్యాచ్‌లో ఎవరెలా పెర్ఫార్మ్ చేస్తారో, కాసేపట్లో తేలిపోనుంది.