ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతి సారి అధికార పార్టీదే పై చేయి ఉంటున్న నేపథ్యంలో తాజాగా విపక్షాలు కూటమి అధికార పార్టీకి తలనొప్పిగా తయారైందని చెప్పొచ్చు. అయితే నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీలో భేటీ అయిన విపక్షాల కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్ సిన్హా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొననుండడం సంచలనంగా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే.. మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్‌లో సూరత్‌కు వెళ్లినట్లు సమాచారం. తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్‌నాథ్ షిండే తెలిపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సూరత్‌లోని గ్రాండ్ భగవతీ హోటల్‌లో ఆ ఎమ్మెల్యేలు బస చేస్తున్నట్లు…
మరోసారి రాష్ట్రపతి పదవికి అభ్యర్థి కోసం ప్రతిపక్షాల వేట ప్రారంభమైంది. ఢిల్లీలో ఇవాళ మరోసారి విపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు విపక్షాలు మరోసారి భేటీ కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఇక మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మంగళవారం నాటి భేటీకి తాను హాజరవుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వెల్లడించారు. ఉత్కంఠగా సాగుతుందునుకున్న రాష్ట్రపతి…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు విపక్ష నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అధికార బిజెపి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోంది. ఇటు విపక్షలు కూడా అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. విపక్షాలు ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నాలు అయితే తెరవెనక గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి విపక్ష పార్టీలు మళ్లీ భేటీ…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి రాజుకుంటోంది. విపక్షాల నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసేందుకు నిరాకరించారు జమ్మూ కశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికలలో పోటీకి ఎన్సీపీ నేత శరద్ పవార్ అయిష్టత ప్రకటించిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్షనేతల భేటీలో రాష్ట్రపతి ఎన్నికల కోసం ఫరూఖ్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీల పేర్ల పరిశీలించారు. కాశ్మీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కొన్నాళ్ళపాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతానని వెల్లడించారు ఫరూక్ అబ్దుల్లా. రాష్ట్రపతి ఎన్నికల…
ఇప్పుడు చర్చ మొత్తం రాష్ట్రపతి ఎన్నికలపైనే.. అధికార కూటమి అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఓవైపు జరుగుతుంటే.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? అనే విషయాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నిక లేకుండా ఏకగ్రీవం ద్వారా తమ రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎన్డీయే ఎవరిని పెట్టినా కూడా…
ఇప్పుడు చర్చ మొత్తం రాష్ట్రపతి ఎన్నికలపైనే.. అధికార కూటమి అభ్యర్థి ఎవరు? అనే చర్చ ఓవైపు జరుగుతుంటే.. ప్రతిక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరు? ఈ రోజు తేలిపోనుందా? అనే చర్చ సాగుతోంది.. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.. అందులో భాగంగా టీఎంసీ సుప్రీం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇవాళ విపక్షాలతో సమావేశం కానున్నారు.. అయితే, ఈ భేటీకి దూరంగా ఉంటున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్…
ఇవాళ రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుండటం, అలాగే ఢిల్లీలో విపక్ష పార్టీలు సమావేశం అవనుండటంతో… హస్తినలో జరిగే రాజకీయ పరిణామాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తి నెలకొంది. జులై 24వ తేదీన రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీలోపు కొత్త రాష్ట్రపతి ఎన్నుకోవాల్సి ఉంది. ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించి… నేడు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే నెల 18న ఎన్నికలు, 21న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఎలక్టరోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక…
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే భారత రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. యూపీఏ తరఫున ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌తో పాటు కేంద్ర మంత్రిగా, లోక్ సభ స్పీకర్‌గానూ రాణించిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత మీరా కుమార్‌లు రేసులో ఉన్నట్లు సమాచారం. అభ్యర్థి ఎంపిక కోసం…