భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ జులై 24న పదవీ విరమణ చేయనున్నారు. కొత్త రాష్ట్రపతి జులై 25న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో భారత నూతన రాష్ట్రపతిగా ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జులై 18న ఎన్నికలు జరగనుండగా… కొత్త రాష్ట్రపతి ఎవరన్నది జులై 21న జరగనున్న ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది. మరి రాష్ట్రపతి అభ్యర్థిగా అధికార ఎన్డీఏ,…
ఎప్పుడు ఏదో ఓ రాజకీయ అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మహారాష్ట్ర బివండీలో శనివారం ఓ సభలో ప్రసంగించారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం నాది కాదు, మోదీ- షాలది కాదు, ఠాక్రేలది కాదని.. ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమే అని ఆయన అన్నారుు. మొగల్స్ తరువాతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నాయని అసదుద్దీన్ అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా…
కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డిజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దేశ ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరల నుంచి కాస్త ఉపశమనం కలిగించింది. ఇదిలా ఉంటే కేంద్ర నిర్ణయంపై విపక్షాలు స్పందిస్తున్నాయి. తాజాగా కేంద్ర నిర్ణయంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘ ఏం లేనిదాని కన్నా ఇది మంచిది’ అంటూ కామెంట్స్ చేశారు. కేంద్రం లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గించిన తర్వాత ఈ…
ముంబైలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ… శరద్‌పవార్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. బారికేడ్లు తీసుకొని లోపలికి వెళ్లారు. శరద్ ఇంటిపై చెప్పులతో దాడి చేశారు. గతేడాది నవంబర్ నుంచి సమ్మే చేస్తున్నా… శరద్ పవర్ పట్టించుకోలేదని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ఫైరవుతున్నారు కార్మికులు. Read Also: Sri Ram Navami: భైంసాలో శోభాయాత్ర.. హైకోర్టు కీలక ఆదేశాలు.. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల్లా గుర్తించాలంటూ… మహారాష్ట్ర ఆర్టీసీ…
ఢిల్లీలో జరిగిన ఓ పరిణామం.. మహారాష్ట్రలోని సంకీర్ణంలో హీట్ పుట్టించింది.. ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. పార్లమెంట్‌లోని ప్రధాని మోడీ కార్యాలయంలో ఇద్దరూ దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అయితే, ఈ సమావేశంలో మహారాష్ట్ర అధికార సంకీర్ణ నాయకులు మరియు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇతర రాజకీయ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను లేవనెత్తినట్టుగా తెలుస్తోంది.. మనీలాండరింగ్ కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్,…
రాష్ట్రంలో జరుగుతున్న కోల్ స్కాంపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ప్రధానికి.. కోల్ ఇండియాకి ఫిర్యాదు చేశాం. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్ ని సీఎండీగా కొనసాగిస్తున్నారు. 50 వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోంది. ప్రధాని, కోల్ సెక్రెటరీ లకు ఫిర్యాదు చేశాం. కేంద్ర మైనింగ్ మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తే..మేము చేసేది ఏమీ లేదు ప్రధాని కార్యాలయం చూసుకుంటుంది అని చెప్పారు. సెంట్రల్…
ముంబై పర్యటనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. 1969 ఉద్యమ సమయం నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్‌ది అని కొనియాడారు. దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశం ప్రస్తుతం…
దేశంలో కరోనా వీరవిహారం చేస్తూనే వుంది. వీఐపీలు ఎవరినీ కోవిడ్ మహమ్మారి వదలడం లేదు. రాజకీయ రంగంలోనూ కరోనా వ్యాప్తి అధికమైంది. దేశంలో 3,06,064 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఈరోజు 27,469 కేసులు తక్కువగా నమోదుకావడం ఊరటనిచ్చేవిషయం. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 439 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక, 24 గంటల్లో 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో…
బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి తప్పించేందుకు టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంకణం కట్టుకున్నారు. దీనికోసం నిత్యం అన్ని పార్టీల ప్రముఖ రాజకీయ నేతలను మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆమె శరద్‌పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ.. బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం కావాలన్నారు. అంతేకాకుండా టీఎంసీతో మాకు పాత అనుబంధం ఉందని గుర్తు…
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. పార్టీలన్నీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా.. బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాలంటున్నారు నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్.. ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని కోరిన ఎన్సీపీ చీఫ్.. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) పొత్తుతో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే,…