Vivek Agnihotri's key comments on Sharad Pawar's comments: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బాలీవుడ్ కు ముస్లిం సమాజం నుంచి అతిపెద్ద సహకారం లభించిందనే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా శరద్ పవార్ ను విమర్శించారు. శరద్ పవార్ వ్యాఖ్యలతో తన సందేహాలు తీరాయని వ్యాఖ్యానించారు. తాను ముంబైకి వచ్చినప్పుడు శరద్ పవార్…
లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఉత్తర భారతదేశం, పార్లమెంట్ల మనస్తత్వం ఇంకా అనుకూలంగా లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. నాలుగు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన నితీష్ కుమార్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు కోసం ప్రతిపక్ష నేతల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో సమావేశమయ్యారు.
Nitis Kumar's comments on Prime Ministerial candidature: బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఎన్డీయేతర కూటమికి సంబంధించిన పార్టీ నాయకులను వరసగా కలుస్తున్నారు. ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు నితీష్ కుమార్. అయితే ఇప్పటికే ఆర్జేడీ పార్టీలో పాటు జేడీయూ కూడా నితీష్ కుమార్ 2024లో ప్రధాని రేసులో ఉంటారని వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ కీలక…
మహారాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార మార్పిడితో రాజకీయాలు వేడెక్కిన వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తన రాజకీయ పార్టీకి చెందిన అన్ని జాతీయ స్థాయి విభాగాలు, సెల్స్‌ను తక్షణమే రద్దు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ బుధవారం తెలిపారు.
పార్టీ చీలికకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కారణమని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆరోపించారు. రౌత్ కోరిక మేరకు ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారని అన్నారు.
Vice President Election : రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతుగా నిలిచింది టీఆర్ఎస్. హైదరాబాద్ వచ్చిన యశ్వంత్‌కు ఘన స్వాగతం పలికింది కూడా. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కూడా ముగియడంతో… ఇక తేలాల్సింది ఫలితాలే. ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల హడావుడి మొదలైంది. NDA తరఫున జగదీప్ ధనఖడ్ బరిలో ఉంటే.. విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్‌కు చెందిన మార్గరెట్ ఆళ్వా నామినేషన్ వేశారు. దీంతో టీఆర్ఎస్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.…
భారత ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పేరును విపక్ష పార్టీలు ఎంపిక చేశాయి. ఆమెను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ వైఖరి ఏంటి? విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తుందా? దక్షిణాది లేదా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు బరిలో ఉంటే ఏం చేస్తారు? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ వచ్చిన సిన్హాకు ఘన స్వాగతం పలికింది కూడా. ఇదే అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, NCP చీఫ్ శరద్ పవార్ నిర్వహించిన సమావేశాలకు టీఆర్ఎస్ వెళ్లలేదు.…