Raj Thackeray: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ ర్యాలీని నిర్వహించాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మహా వికాస్ అఘాడి (MVA), రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) నాయకులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు
Sanatana Remarks: శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘సనాతన ధర్మాన్ని’’ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ఆదివారం ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని కించపరచాలని, హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించాలని జితేంద్ర అవద్ నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీం ఇండియాకు 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ కృషికి ఫలితం దక్కింది. వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్ కు హిట్ మ్యాన్ పేరు పెట్టారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మీద ఉన్న స్టాండ్‌ను శుక్రవారం ప్రారంభించారు. మే 16వ తేదీ శుక్రవారం నాడు, రోహిత్ శర్మ తల్లిదండ్రులు రిబ్బన్ కట్ చేసి స్టాండ్‌ను ప్రారంభించారు. రోహిత్…
Fahad Ahmad: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) నాయకుడు, వివాదాస్పద బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్‌కి పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. ఎన్సీపీ(ఎస్పీ) యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జితేంద్రం అహ్వాద్ సిఫారసు మేరకు శరద్ పవార్, సుప్రియా సూలే ఆమోదం పొందిన తర్వాత ఫహద్ అహ్మద్ పార్టీ యూత్ జాతీయాధ్యక్షుడిగా నియమితులైనట్లు ఎన్సీపీ(ఎస్పీ) ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండియా కూటమిపై సీనియర్ రాజకీయ వేత్త, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి కేవలం జాతీయ ఎన్నికల కోసమే ఉందని.. రాష్ట్ర, స్థానిక ఎన్నికల కోసం కాదని.. దీనిపై ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు.
నూతన సంవత్సరంలో మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నిన్నామొన్నటిదాకా విడివిడిగా ఉన్న అజిత్ పవార్-శరద్ పవార్ కుటుంబాలు మళ్లీ ఒక్కటి కాబోతున్నాయన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలవడంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి గెలవడంపై మహారాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం లేదని, ఆనందం కనిపించడం లేదని శరద్ పవార్ శనివారం అన్నారు. కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. Read Also: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్…
Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’ అత్యంత దారుణంగా ఓడిపోయింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, శివసేన(ఠాక్రే), శరద్ పవార్(ఎన్సీపీ)లు కేవలం 46 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే శివసేనల ‘‘మహాయుతి’’ కూటమి 233 స్థానాలను గెలుచుకుంది. ఒక్క బీజేపీనే 132 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
Hemant Soren: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ( గురువారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.