West Bengal CM Mamata Banerjee on Monday, July 4, echoed NCP chief Sharad Pawar, saying that the new Maharashtra government, led by CM Eknath Shinde and Deputy CM Devendra Fadnavis, will fall soon.
మహారాష్ట్రలో కొత్త ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే, డిప్యూటీగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకార సమయంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్వీట్లు తినిపించడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఈ వివాదంపై ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు. నేను ఎన్నో ప్రమాణస్వీకారాలను చూశానని.. ఇలా ప్రమాణం చేసిన వారికి గవర్నర్ స్వీట్లు తినిపించడం, పువ్వులు ఇవ్వడం ఎప్పుడు చూడలేదని ఆయన అన్నారు.…
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్నుల శాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. అయితే దీన్ని ఆయన ప్రేమలేఖగా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు ఐటీ నోటీసు వచ్చిందని అది ప్రేమలేఖ అని ఆయన గురువారం ట్వీట్ చేశారు. 2004, 20009, 2014, 2020 సంవత్సరాల్లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి తాజాగా ఐటీ నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయిన…
మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో పాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, రాష్ట్ర కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్, పార్టీ నేత ప్రఫుల్ పటేల్ ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతో శ్రీకి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. శివసేన నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం.…
మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతున్నారు. శివసేన తిరుగుబాటు నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో 35 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు శివసేన పార్టీలో చీలిక తెచ్చారు. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అయితే ఏక్ నాథ్ షిండే మాత్రం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఎన్సీపీ,…
మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శివసేనతో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టిస్తోంది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే 35 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేయడంతో రాజకీయ సంక్షోభం మొదలైంది. తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు షిండే. శివసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు…
ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతి సారి అధికార పార్టీదే పై చేయి ఉంటున్న నేపథ్యంలో తాజాగా విపక్షాలు కూటమి అధికార పార్టీకి తలనొప్పిగా తయారైందని చెప్పొచ్చు. అయితే నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీలో భేటీ అయిన విపక్షాల కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్ సిన్హా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో…