రైల్లో ప్రయాణిస్తుండగా తాను నిమ్స్‌లో డాక్టర్‌నంటూ ఆ వృద్ధురాలితో మాట మాట కలిపాడు. అంతే ఇంకేముంది ఆమే అనారోగ్యం సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నీకున్న జబ్బును నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పాడు.
సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)కి చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిఆర్‌ఎఫ్) బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 42 వర్షాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 5 రహదారులను (రిచర్డ్‌సన్ రోడ్, ప్రోట్నీ రోడ్, బయామ్ రోడ్, అమ్ముగూడ రోడ్, అల్బయిన్ రోడ్) సామాన్య ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Vande Bharat : వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏప్రిల్ 8న ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న.. సికింద్రబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభమైంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
సికింద్రాబాద్ మహాంకాళీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధ రాత్రి దారుణం చోటుచేసుకుంది. రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపం వద్ద యాచకురాలు దారుణ హత్యకు గురైంది. ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి బండ రాయితో హత్య చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.