ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం, అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.
సికింద్రాబాద్ స్వప్న లోక్ అగ్నిప్రమాద మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆస్పత్రిలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ పరామర్శించారు.
సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్లో వరంగల్‌కు చెందిన ముగ్గురు, ఇద్దరు మహబూబాబాద్ వాసులు, ఖమ్మంకు చెందిన ఒకరు ఉన్నారు.
Vande Bharat: 'వందే భారత్' రైళ్లలో పరిశుభ్రత లోపించింది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో ప్రయాణించే సమయంలో వాటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రయాణికులపై కూడా ఉంది.
సికింద్రాబాద్ ప్రాంతంలోని రామ్‌గోపాల్‌పేట్‌లో ఉన్న డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటల సమయంలో భవనం కింది అంతస్తులో షార్టు సర్క్యూ్ట్ కారణంగా మంటలు చెలరేగాయి.
ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్‌లన్నీ అక్రమ కట్టడాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని మంత్రి పరిశీలించారు.
VandeBharat: ఏపీ, తెలంగాణ మధ్య మరో కొత్త రైలు అందుబాటులోకి రానుంది. ఈనెల 19న ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించబోతున్నారు. ఈ రైలు సికింద్రాబాద్-విశాఖ మధ్య పరుగులు పెట్టనుంది. అయితే సాధారణంగా వందేభారత్ రైలు స్పీడ్ గంటకు 180 కి.మీ.తో వెళ్లాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైలు కేవలం 82.58 కి.మీ. స్పీడ్‌తోనే నడవనుంది. దీనికి కారణం రైల్వే ట్రాక్ అని అధికారులు చెప్తున్నారు. ఇంకా సరైన రీతిలో…