Fake Doctor: డాక్టర్నని నమ్మించి ఓ వృద్ధురాలికి కుచ్చుటోపీ పెట్టాడు. ఈ రోజుల్లో మనుషుల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని అందినంత దోచేస్తున్నారు. అంతేకాకుండా చిన్న, పెద్ద, ముసలి అని తేడా లేకుండా డబ్బుల కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. తరుచుగా మనం రోజు టీవీల్లో గానీ, పేపర్లో గానీ ఇలాంటి వార్తలు వింటూనే వింటాం. ఏదైతేనేమీ డబ్బుల కోసం ఇంతటి ఆగయిత్యాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.
Read Also: Hyper Aadi : శ్రీ లీలను ఇమిటేట్ చేసిన హైపర్ ఆది..!!
రైల్లో ప్రయాణిస్తుండగా తాను నిమ్స్‌లో డాక్టర్‌నంటూ ఆ వృద్ధురాలితో మాట మాట కలిపాడు. అంతే ఇంకేముంది ఆమే అనారోగ్యం సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నీకున్న జబ్బును నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పాడు. అనంతరం రైలు దిగగానే ఆ వృద్ధురాలిని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం ఏవో మందులిచ్చి వేసుకోమన్నాడు. అవి వేసుకున్న ఆ వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది.
Read Also: Agni Prime Ballistic Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. అగ్ని ప్రైమ్ మిస్సైల్ టెస్ట్ సక్సెస్..
ఇదే కరెక్ట్ సమయంగా భావించిన కేటుగాడు.. ఆ వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారంతో పాటు డబ్బులతో ఉడాయించాడు. కాసేపటికి మెలుకువ వచ్చిన బాధితురాలు తన మెడలో ఉన్న బంగారు గొలుసు పోయిందని.. కేటుగాడు మోసం చేసినట్లు గుర్తించి.. వెంటనే గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని డిటేల్స్ తెలియాల్సి ఉంది.