Secendeabad Crime: సామాన్యుడిపై ఖాకీల కర్కశత్వం.. కర్రలతో కాళ్లు విరగగొట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు పాత నేరస్థుడు కాదు, అతనిపై కేసులు అస్సలు లేవు.. అక్కడేమి పెద్ద గొడవ కూడా కాలేదు. అస్సలు అతని తప్పేమీ లేదు. కేవలం తోపులాట. అయితే ఆ సీన్ ను ఓ సినిమాలో చూపించి నట్లుగా పోలీసులు వ్యవహరించారు. అవతలి వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకుని.. నిజానిజాలు పరిశీలించకుండా.. నేరం చేయని వాడిపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనను స్థానికుడు ఒకరు బాత్‌రూంలో ఉంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన సూర్య ఆరోక్యరాజ్ ఓ జిమ్‌లో సహాయకుడు. నెలకు రూ.8 వేల సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో మెట్టుగూడలోని తల్లి శీల ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి అతడు ఉంటున్న బస్తీలో ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వెళ్తుండగా వారించాడు. దీంతో వారి మధ్య వాదన మొదలై.. తోపులాటకు దారితీసింది. బైక్‌పైనున్న వ్యక్తి చిలకలగూడ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నలుగురు కానిస్టేబుళ్లు సూర్య ఇంటికి వచ్చారు.
Also Read
- CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
- Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
సూర్య ఆరోక్య రాజ్‌ను స్టేషన్‌కు రమ్మని కోరారు. రాత్రి 11 గంటలవుతోంది. ఇప్పుడు రాలేను. ఉదయాన్నే వస్తా అని సమాధానమిచ్చాడు. దాంతో పోలీసులు సూర్య పై దాడి ప్రారంభించారు. దుడుక్డర్రను సూర్య రెండు కాళ్ల మధ్య ఉంచి బూటు కాళ్లతో తన్నారు. తల్లి శీల ప్రాధేయపడినా వినలేదు. ఆమె పైనా దాడికి యత్నించారు. బస్తీవాసులు సూర్య ఇంటికి చేరుకోవడంతో వెళ్లిపోయారు.
సూర్యను స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దెబ్బలకు సూర్య ఎడమ కాలు విరిగినట్లు, కుడికాలుకూ తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు గుర్తించారు. పిడిగుద్దులతో అతడి ముఖం వాచిపోయింది. మంగళవారం సర్జరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, తన కొడుకును దారుణంగా హింసించిన వారిపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని సూర్యతల్లి శీల డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Yanamala Krishnudu: తుని రాజకీయాల్లో కీలక పరిణామం.. జనసేనలో చేరిన యనమల కృష్ణుడు!
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!