రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరుగునున్న భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వారు మాట్లాడుతూ.. HICC మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – రాజ్ భవన్ – పంజాగుట్ట – బేగంపేట్ ఎయిర్పోర్ట్ – పరేడ్ గ్రౌండ్ మరియు పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లలో ప్రయాణించడం నిషేధించారు. టివోలి X రోడ్ నుండి ప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేయబడుతుందని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలోని…
అగ్నిపథ్ స్కీమ్ దేశాన్నే కుదిపేస్తోంది. ఈ స్కీమ్ ను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీని వ్యతిరేకతకు నిదర్శనం సికింద్రాబాద్ లోని రైల్వే ఘటన అనే చెప్పొచ్చు. స్కీమ్ ను రద్దుచేయాలని నిరసనలు భారీగా జరిగాయి. అయితే దీనిపై పలు కార్పొరేట్ దిగ్గజాలు స్పందించి వ్యాక్యలు చేశారు. కొద్దిరోజుల క్రితమే మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ అగ్ని వీరుల భవిష్యత్ పై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్…
సికింద్రాబాద్ రైల్వేస్టేష్ విధ్వంసం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈఘటనలో సూత్రధారి అయిన సుబ్బారావు అరెస్టుతో కీలక అంశాలు వెలువడుతున్నాయి. సుబ్బారావుతో పాటు ముగ్గురు అనుచరులు అరెస్ట్ చేశారు పోలీసులు. కుట్ర కోణంలోనే సికింద్రబాద్ అల్లర్లు జరిగాయని రైల్వే పోలీసులు నిర్ధారించారు. సికింద్రాబాద్ అల్లర్ల వెనకాల సుబ్బారావు పాత్ర ఉందని తేల్చారు. సికింద్రాబాద్‌కు అభ్యర్థులను సుబ్బారావే తరలించాడని, సికింద్రాబాద్ సమీపంలోని 8 ఫంక్షన్ హాల్లలో అభ్యర్థులను పెట్టాడని తెలిపారు. సుబ్బారావు కనుసన్నల్లోనే అల్లర్లు జరిగాయని తెలిపారు. 8…
చాయ్ అమ్ముకునే వ్యక్తి ని ప్రధానిని చేస్తే.. దేశ యువతకు నరేంద్ర మోడీ ఇచ్చే నజరానా ఇదేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. చంచల్ గూడ జైల్లో సికింద్రాబాద్ నిందుతులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. జైల్లో నిరసనకారులతో ములాకత్ అయి వారికి అండగా ఉంటామని, సికింద్రాబాద్ ఘటన, కేసులకు సంబంధించి న్యాయ సలహాలు ఇస్తామని నిందితులకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఎదురుచూస్తున్నారని, అగ్నిపథ్ పై…
సికింద్రాబాద్ రైల్వే ఘటనలో జరిగిన అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ అల్లర్ల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో వున్న ఆవుల సుబ్బారావు నోరువిప్పాడు. తన అనుచరులతో విధ్వంస రచన చేసినట్టు పోలీసులు తేల్చారు. శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులతో.. విద్యార్థులను రెచ్చగొట్టించినట్టు తేలింది. ఆందోళనలు చేయాలని వాట్సాప్ గ్రూపుల్లో అనుచరులు పిలుపునిచ్చారు. గుంటూరు ర్యాలీ…
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించి, ఆందోళన చేసి రైళ్ళకు నిప్పు పెట్టారు. అగ్నిపథ్ ను కేంద్రం వెనక్కు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అగ్నిపథ్ తో వారి కుటుంబాలు రోడ్డు పడతాయని మండిపడ్డారు. రెండు, మూడేళ్ల నుంచి ఆర్మీలో చేరేందుకు ఎదురు చూస్తుంటే అగ్నిపథ్ స్కీం తీసుకు వచ్చి కేంద్రం…
పల్నాడు జిల్లా నర్సరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీలో ఐటీ, ఐబీ సోదాలు ముగిసాయి. అకాడమీ లోని కంప్యూటర్ లలో సమాచారాన్ని హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పోలీసుల అదుపులోనే ఆవుల సుబ్బారావు వున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావు పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వందలమంది విద్యార్థులను పంపినట్టు గుర్తించారు. ఈ మొత్తం ఘటన వెనక ఉన్నది…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అగ్నిపథ్ ఆందోళనలతో చెలరేగిన హింసపై విచారణ కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ఆందోళనలో పాల్గొన్నారు? వీరంతా ఒక్కసారిగా ఎలా వచ్చారు? వీరు హింసకు పాల్పడేలా ఎవరైనా ఉసిగొల్పారా? అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 52 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఏడుగురు అనుమానితులను రైల్వే పొలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా, పోలీస్ వీడియో రికార్డింగ్, మీడియా ఫుటేజ్, సోషల్ మీడియా, సెల్ ఫోన్…