కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించి, ఆందోళన చేసి రైళ్ళకు నిప్పు పెట్టారు. అగ్నిపథ్ ను కేంద్రం వెనక్కు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అగ్నిపథ్ తో వారి కుటుంబాలు రోడ్డు పడతాయని మండిపడ్డారు. రెండు, మూడేళ్ల నుంచి ఆర్మీలో చేరేందుకు ఎదురు చూస్తుంటే అగ్నిపథ్ స్కీం తీసుకు వచ్చి కేంద్రం వారికి అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చొరబడి పలు రైళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్ళు విసిరారు.
ఈ ఘటనలో పలు ఆర్మీ విధ్యార్థులకు గాయాలయ్యాయి. వరంగల్ కు చెందిన ఒక యువకుడు మృతి చెందాడు. ఈఘటనకు సంబంధించిన ప్రధాన సూత్రధారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారంతోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసంలో పలువురికి గాయాలైన వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే వారిలో 9 మందిని తల్లిదండ్రులకు అప్పగించారు. మిగిలిన 4 మందికి గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. డిశ్చార్జ్ చేసిన తొమ్మిది మంది వారి వివరాలు.. ఎస్ లక్ష్మణ్ రెడ్డి- నల్గొండ జిల్లా, ఎ.కుమార్- వరంగల్ జిల్లా, ఇ.విద్యాసాగర్- ఆసిఫాబాద్, జి.పరశురామ్-కామారెడ్డి జిల్లా, ఆర్. భరత్ కుమార్-నిర్మల్ జిల్లా, జె. శ్రీకాంత్-మహబూబ్ నగర్ జిల్లా, కె.రాకేష్-జయశంకర్ జిల్లా, పి.మోహన్-కామారెడ్డి జిల్లా, మల్లికార్జున్-వరంగల్ జిల్లా లకు చెందిన వారిని ఈరోజు డిశ్చార్జ్ చేసి పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు.
TDP : వచ్చే ఎన్నికల్లో టీడీపీ తాపత్రయం అదేనా.?