చాయ్ అమ్ముకునే వ్యక్తి ని ప్రధానిని చేస్తే.. దేశ యువతకు నరేంద్ర మోడీ ఇచ్చే నజరానా ఇదేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. చంచల్ గూడ జైల్లో సికింద్రాబాద్ నిందుతులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. జైల్లో నిరసనకారులతో ములాకత్ అయి వారికి అండగా ఉంటామని, సికింద్రాబాద్ ఘటన, కేసులకు సంబంధించి న్యాయ సలహాలు ఇస్తామని నిందితులకు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత ఎదురుచూస్తున్నారని, అగ్నిపథ్ పై ప్రధాని హడావిడి నిర్ణయం తీసుకున్నారని, ఏకపక్ష నిర్ణయంతో యువకుల్లో అయోమయం నెలకొందని విమర్శించారు. కేవలం 4ఏళ్లు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అంటే ఎట్లా అన్న ఆయన..అగ్నిపథ్ 6 నెలల ట్రైనింగ్ లో ఏం నేర్పిస్తారని ప్రశ్నించారు.
రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి భద్రత లేకుండా కుట్ర చేశారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా 60 వేల మందిని ఆర్మీలో రిక్రూట్ చేయడం జరుగుతుందన్నారు. కాని మోడీ సర్కార్ రెండేళ్లుగా ఆర్మీ నియామకాలు చేపట్టలేదన్నారు.అగ్నిపథ్ పథకాన్ని హడావుడిగా తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అత్యంత కీలకమైన అంశంలో పార్లమెంట్ లో చర్చించకుండానే నాలుగు సంవత్సరాలకోసం రిక్రూట్ చేసే విధానం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఆర్మీ అభ్యర్థులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, భవిష్యత్ లో ఉధ్యోగాలు రాకుండా నాన్ బెయిల్ కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాము విధ్వంసాలకు పాల్పడలేదని రిమాండ్ లో ఉన్న ఆర్మీ అభ్యర్థులు చెబుతాన్నారని చెప్పారు.
ఇంతమంది పై ఇంత గుడ్డిగా 307ఐపీసీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. అగ్నిపథ్ ను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఆర్మీ అభ్యర్థుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల నుండి ఆర్మీలో నియామకాలు చేపట్టలేదని..దీంతో సైనికుల కొరత ఏర్పడిందన్నారు. 2020లో ఫిజికల్ ఎగ్జామ్స్ పాసైన వారికి రాత పరీక్షలు నిర్వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. న్యాయ సలహా కోసం ఇప్పటికే గాంధీభవన్ లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఇక చంచల్ గూడ జైలు బయట నిందితుల కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, అనిల్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి నిందితులను కలిశారు.
Samsung Galaxy M52: అద్భుత ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్‌పై 30 శాతం ధర తగ్గింపు..