అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసంలో కీలక పరిణామాలు వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసులో సాయి డిఫెన్స్ కోచింగ్ సెంటర్ కు చెందిన ఆవుల సుబ్బారావుని పోలీసులు నిందితుడుగా చేర్చారు. ఇప్పటివరకు అరెస్టైన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆవుల సుబ్బారావుని నిందితులుగా చేర్చారు. కామారెడ్డి చెందిన మధుసూదన్, ఆదిలాబాద్ జిల్లా చెందిన పుద్విరాజ్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు సుబ్బారావు ఎఫ్ఐఆర్‌లో నిందితుడుగా పోలీసులు పెట్టారు. నర్సీపట్నం పోలీసుల అదుపులో ఉన్న ఆవుల సుబ్బారావు ని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ అధికారులు తీసుకొని వచ్చారు. ప్రస్తుతానికి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో సుబ్బారావు ఉన్నారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసు వెనకాల ఆవుల సుబ్బారావు పాత్ర కీలకంగా ఉందని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సుబ్బారావు ప్రోద్బలంతోనే ఆర్మీ అభ్యర్థులు రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. సుబ్బారావు తో పాటు అతనికి సంబంధించిన 12 సంస్థల మేనేజర్లు పాత్ర కూడా ఇందులో ఉన్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే యాభై ఆరు మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తాజాగా ఆవుల సుబ్బారావు ని పోలీసులు నిందితుడు చేర్చడంతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఇక, సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక సాక్ష్యాలు ఎన్టీవీకి చిక్కాయి.. అల్లర్లు చేసిన నిందితుల వీడియోలు, రైల్వేస్టేషన్‌లో మొదటగా విధ్వంసం చేసిన నిందితుల వీడియోలు, శాంతియుతంగా ఆందోళన చేయడానికి వచ్చిన వారిని విధ్వంసం వైపు ప్రోత్సహించిన కొందరు యువకులకు సంబంధించిన వివరాలను ఉన్నాయి.. ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్ అల్లర్లకు సూత్రధారి అని తేల్చారు. ప్యాసింజర్ బోగీలోకి వెళ్లి సీట్లకు నిప్పుపెట్టిన పృథ్వీరాజ్.. ఆ వీడియోలు తీసుకున్నాడు.. ప్లాట్‌ఫామ్‌పై ఆస్తులను ధ్వంసం చేశాడు.. ఆస్తులు, బోగీలకు మంటలుపెడుతూ వీడియోలు తీయించిన పృథ్వీరాజ్.. ఆ విధ్వంసం వీడియోలను గ్రూప్‌లలో పోస్ట్ చేశాడు.. ఇక, పృథ్వీరాజ్ వీడియోలు చూసి రెచ్చిపోయారు అభ్యర్థులు. రైల్వే ఆస్తులు, బోగీలను తగులబెట్టారు.. దీంతో, పృథ్వీరాజ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
సికింద్రాబాద్ విధ్వంసం కేసులో 10 మంది అరెస్టు చేశారు పోలీసులు.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు ప్రస్తావించారు.. ఆవుల సుబ్బారావు ప్రొద్భలంతోనే దాడులు జరిగినట్టు తేల్చారు. ఆవుల సుబ్బారావు, మేనేజర్ శివల ప్రధాన పాత్ర ఉందని.. అభ్యర్థులకు పూర్తిస్థాయిలో సహకారం అందించారని.. వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం చేశారని గుర్తించారు. సుబ్బారావు ప్లాన్ ప్రకారమే సికింద్రాబాద్ చేరుకున్న నిందితులు విధ్వంసానికి పాల్పడ్డారు.. దీంతో, పృథ్వీరాజ్‌తోపాటు 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.. వాట్సాప్ అడ్మిన్లను కూడా అరెస్టు చేశారు.. అరెస్టైన నిందితుల్లో ఏ2 రాథోడ్ పృథ్వీరాజ్, ఏ3 బింగి రమేశ్, ఏ4 రాజా సురేంద్ర కుమార్, ఏ5 సంతోష్, ఏ6 మహ్మద్ సబార్, ఏ57 యోగేష్, ఏ58 పరుశురాం, ఏ59 అయ్యప్పచారి, ఏ60 శివసుందర్ రెడ్డి, ఏ61 తుకారాం ఉన్నారు. రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన 10 మందికి జ్యూడిషల్ రిమాండ్ విధించింది రైల్వేకోర్టు.. దీంతో నిందితులను కోర్టు నుంచి చంచల్‌గూడా జైల్‌కు తరలించారు.. ఇక, కోర్టు వద్ద తమ పిల్లలను చూసి బోరున విలపించారు వారి తల్లిదండ్రులు.
రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు పోలీసులు. విద్వేశాలు రెచ్చగొట్టి తగిన సదుపాయాలు కల్పించినట్టు సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని సుబ్బారావుతో పాటు మరో వ్యక్తి శివను చేర్చారు. వీళ్ళిద్దరు సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకులు. విధ్వంసం చేస్తున్న సమయంలో కొన్ని పేర్లు చెప్పుకున్నారు అభ్యర్థులు. సాయిడిఫెన్స్ అకాడమీ కి చెందిన సుబ్బారావు, శివలు విధ్వంసం చేయాలని చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు. హకీంపేట్ సోల్జర్స్ వాట్సప్ గ్రూప్ లో ఫోటోలను షేర్ చేసినట్టు సుబ్బారావు, శివలను చూపారు. అభ్యర్థులకు స్టేషన్ వరకు చేరేందుకు రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వీరిని కుట్రకోణంపై విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో63మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటివరకు 55మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పలువురు పరారీలో ఉన్నారు. వారికోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. తెలిసి చేసినా.. తేలియక చేసినా! తప్పు తప్పే.. చట్టం అందరికీ సమానమే. రెచ్చగొట్టారా! రెచ్చిపోయారా! కారణం ఏదైనా కళ్ల ముందే పిల్లలు జైలుపాలు అవుతుండటంతో కన్న పేగులు తల్లడిల్లుతున్నాయి.