సికింద్రాబాద్ రైల్వేస్టేష్ విధ్వంసం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈఘటనలో సూత్రధారి అయిన సుబ్బారావు అరెస్టుతో కీలక అంశాలు వెలువడుతున్నాయి. సుబ్బారావుతో పాటు ముగ్గురు అనుచరులు అరెస్ట్ చేశారు పోలీసులు. కుట్ర కోణంలోనే సికింద్రబాద్ అల్లర్లు జరిగాయని రైల్వే పోలీసులు నిర్ధారించారు. సికింద్రాబాద్ అల్లర్ల వెనకాల సుబ్బారావు పాత్ర ఉందని తేల్చారు. సికింద్రాబాద్‌కు అభ్యర్థులను సుబ్బారావే తరలించాడని, సికింద్రాబాద్ సమీపంలోని 8 ఫంక్షన్ హాల్లలో అభ్యర్థులను పెట్టాడని తెలిపారు. సుబ్బారావు కనుసన్నల్లోనే అల్లర్లు జరిగాయని తెలిపారు.
8 వాట్సాప్ గ్రూప్‌లను సుబ్బారావు క్రియోట్ చేసి, వాట్సాప్ గ్రూప్‌ల్లో అభ్యర్థులను రెచ్చగొట్టాడని రైల్వే పోలీసులు తెలిపారు. బిహార్ తరహాలో విధ్వంసం చేయాలని వాయిస్ మెస్సేజ్‌లు చేసినట్లు పోలీసులు తెలిపారు. 16వ తేదీ సాయంత్రమే సుబ్బారావు హైదరాబాద్ చేరుకున్నారని, అల్లర్ల కోసం రూ.35వేలు ఖర్చు చేశాడని అన్నారు. విధ్వంసాన్ని సుబ్బారెడ్డి అనుచరుడు బసిరెడ్డి దగ్గరుండి పర్యవేక్షణ చేసినట్లు నిర్దారించారు. స్టేషన్‌లో అల్లర్లు, విధ్వంసం చూసి సుబ్బారావు సంతృప్తి చెందాడని పోలీసులు తెలిపారు. ఫైరింగ్‌లో ఒకరు చనిపోవడంతో.. సుబ్బారావు హైదరాబాద్ నుంచి పారిపోయాడని అన్నారు. అల్లర్లు జరిగిన వెంటనే వాట్సాప్‌లో మెస్సేజ్‌లు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తేల్చారు. సాక్షాలు లేకుండా చూడాలని సుబ్బారావు ప్రయత్నించాడని రైల్వే పోలీసులు వివరించారు.
Chandrababu : చిత్తూరు మాజీ మేయర్ ఘటనపై.. డీజీపీకి చంద్రబాబు లేఖ..