Sankranti Special : సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు తెలుగు వారి ఇళ్లలో పిండివంటల ఘుమఘుమలు మొదలవుతాయి. అరిసెలు, జంతికలు, మురుకులు, కారప్పూస వంటి వంటకాలు లేకుండా పండగ పూర్తి కాదు. అయితే, ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఈ వంటకాల కోసం పిండి పట్టించడం, సరైన పాకం పట్టడం అందరికీ సాధ్యం కావడం లేదు. ఈ సమస్యను తీరుస్తూ మార్కెట్లోకి వచ్చిన ‘రెడీమేడ్ మిక్స్’ పిండి వంటకాలు ఇప్పుడు గృహిణులకు పెద్ద ఊరటనిస్తున్నాయి. పిండివంటల తయారీ…
కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలు, నోరూరించే పిండివంటలతో ఈ ఉత్సవం ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది. పండగ సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న పర్యాటకులతో ఆత్రేయపురం సందడిగా మారింది. ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణ ‘ఆత్రేయపురం పూతరేకులు’. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పూతరేకులను ఇక్కడ ప్రత్యేక స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. డ్రై…
Bhogi 2026: తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో మొదటి రోజైన ‘భోగి’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే 2026 సంవత్సరంలో భోగి పండుగ ఏ తేదీన జరుపుకోవాలనే విషయంలో సామాన్యుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13న భోగి వస్తుంటుంది, కానీ ఈ ఏడాది గ్రహ గతులు , సౌరమాన గణాంకాల ప్రకారం తేదీలో మార్పు…
సంక్రాంతి పండుగ అనగానే ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. అయితే, ఈ వేడుకల్లో వినోదం కంటే విచారమే ఎక్కువగా మిగిలిస్తున్న ‘చైనీస్ మాంజా’ వినియోగంపై హైదరాబాద్ సిటీ పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారై, గాజు పొడి పూత కలిగిన ఈ దారం పర్యావరణానికి , ప్రాణకోటికి పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం 2016లోనే చైనీస్ మాంజాపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. దీనికి తోడు నేషనల్…
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు.. వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందని…
UGC NET 2025 : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2024 సెషన్ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో జరుగుతున్నాయి. జనవరి 3న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 16 వరకు కొనసాగనున్నాయి. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 15న జరగవలసిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్టీయే పేర్కొంది. జనవరి 16న నిర్వహించవలసిన పరీక్ష మాత్రం…
సంవత్సరం మొత్తం ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతికి సొంత ఊరికి వెళుతుంటారు చాలా మంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి చాలా మంది సొంతుళ్లకు పరుగులు తీస్తుంటారు. పట్నం సగానికి పైగా ఖాళీ అవుతుంది. కాగా.. కొందరు మాత్రం పనులు, వివిధ కారణాల వల్ల ఊరికి వెళ్లలేకపోతారు. అలాంటి వారికి శిల్పారామంలో వేడుకలు ఊరట కలిగిస్తున్నాయి.
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కిషన్‌రెడ్డి తన నివాసాన్ని పల్లెటూరు మాదిరిగా అందంగా అలంకరించారు. కార్యక్రమానికి హజరైన ప్రధానికి ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య మోడీ వేడుక వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోడీ.. ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మోడీ తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.…
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తన నివాసాన్ని పల్లెటూరి గ్రామంగా తీర్చి దిద్దారు. సంక్రాంతి సంబరాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు.
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. శిరీష్ నిర్మాణంలో ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 14వ తేదీన రిలీజ్ అవుతుంది.. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భిన్నంగా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ నైట్ పేరుతో నిర్వహించింది సినిమా టీం. ఇక ఈ సందర్భంగా వెంకటేష్ గతంలో నటించిన…