సంవత్సరం మొత్తం ఎక్కడ ఉన్నా కానీ సంక్రాంతికి సొంత ఊరికి వెళుతుంటారు చాలా మంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి చాలా మంది సొంతుళ్లకు పరుగులు తీస్తుంటారు. పట్నం సగానికి పైగా ఖాళీ అవుతుంది. కాగా.. కొందరు మాత్రం పనులు, వివిధ కారణాల వల్ల ఊరికి వెళ్లలేకపోతారు. అలాంటి వారికి శిల్పారామంలో వేడుకలు ఊరట కలిగిస్తున్నాయి. శిల్పారామం సంక్రాంతి సందర్భంగా సందర్శకులతో కిటకిటలాడుతుంది.. మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.. పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి పండుగ వేడుకలు కొనసాగుతున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల కీర్తనలతో పల్లెటూరి వాతావరణంలో సందర్శకులు ఎంజాయ్ చేస్తున్నారు..
READ MORE: Maha kumbh mela: పాకిస్తాన్‌తో సహా ముస్లిం దేశాల్లో ‘‘మహా కుంభమేళ’’ ట్రెండింగ్..
సొంతూర్లకు వెళ్లలేని వారు శిల్పారామంలో జరిగే సంక్రాంతి వేడుకలను చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.. పబ్లిక్‌ని ఆకట్టుకొనేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈనెల 17వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు కొనసాగనున్నాయి. గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, సోదమ్మలు జంగమ్మయ్యల కథలు ఆకట్టుకుంటున్నాయి.. మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సంబరాలు జరుగుతున్నాయి.. కళలు అంతరించిపోకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు.. శిల్పారామం విలేజ్ మ్యూజియంలో పల్లెటూరు వాతావరణం నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సంక్రాంతి సంబరాల్లో విదేశీయులు కూడా పాలుపంచుకుంటున్నారు..
READ MORE: Train Accident: పట్టాలు తప్పిన రైలు కోచ్‌లు.. తప్పిన పెను ప్రమాదం..