ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కిషన్‌రెడ్డి తన నివాసాన్ని పల్లెటూరు మాదిరిగా అందంగా అలంకరించారు. కార్యక్రమానికి హజరైన ప్రధానికి ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య మోడీ వేడుక వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోడీ.. ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మోడీ తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. గంగిరెద్దులకు ఫలాలు అందించి వస్త్రాలు సమర్పించారు. భోగి మంటలు వేశారు. గాయని సునీత తన పాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి కిషన్‌రెడ్డి వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు.
READ MORE: Onion Benifits: ప్రతి రోజు పచ్చి ఉల్లిపాయలు తీసుకుంటున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?
ఈ వేడుకల్లో స్పీకర్ ఓం బిర్లా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ శకావత్, జ్యోతి రాధిత్య సింధియా, మనోహర్ లాలా కట్టర్, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, సతీష్ చంద్ర దూబే, శ్రీనివాస్ వర్మ, భూపతిరాజు శ్రీనివాసరాజు, సినీనటుడు చిరంజీవి, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, పీవీ సింధు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. దీంతో పాటు ఈ వేడుకలో ఎంపీలు లక్ష్మణ్ ,అనురాగ్ ఠాకూర్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, లక్ష్మణ్, గోడెం నగేష్, బాలశౌరి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, డికే అరుణ, పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నాయి.
READ MORE: Mahakumbh Mela 2025: కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బాబాలు… ఈ 5గురు బాబాలు ప్రత్యేకం..