సంక్రాంతికి నగరం నుంచి వేలాది మంది సొంతూళ్లకు వెళ్లారు. నగరంలో మూడు రోజులపాటు ట్రాఫిక్ రద్దీ చాలా తగ్గిపోయింది. అయితే, సగం నగరం ఖాళీ అయినప్పటికీ సంక్రాంతి వేడుకలు నగరంలో ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండగకు రికార్డ్ స్థాయిలో చికెన్ సేల్స్ జరిగింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 60 లక్షల కిలోల చికెన్ సేల్స్ జరగింది. సాధారణంగా గ్రేటర్ పరిధిలో రోజుకు 10 లక్షల కిలోల చికెన్…
టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో ఘనంగా జరుపుకుంటున్నారు.. నిన్న భోగి వేడుకల్లో సందడి చేసిన బాలయ్య.. సంక్రాంతి సందర్భంగా ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు.. ఇక, బాలయ్య గుర్పంపై స్వారీ అందరినీ ఆకట్టుకుంది.. గుర్రంపై బాలయ్య కూర్చొని ఉండగా.. ఆ గుర్రంతో డ్యాన్స్ వేయించారు.. ఓ పాటను పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తుండగా..…
మొన్నటి వరకు కరోనా నేపథ్యంలో రద్దీని తగ్గించాలన్న ఉద్దేశంతో ప్లాట్‌ఫాం టికెట్ల ధరలను భారీగా పెంచింది రైల్వేశాఖ.. ఇప్పటికే పండుగ సీజన్ ప్రారంభం కావడంతో మరోసారి ప్లాట్‌ఫాం టికెట్ల ధర డబుల్ చేశారు.. తాజాగా, హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.20కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. నిన్నటి వరకు ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10గా ఉండగా.. అది రెట్టింపు అయ్యింది.. సంక్రాంతి నేపథ్యంలో ఫ్లాట్‌ఫాంపై ప్రయాణికుల రద్దీని…
సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేశారు. జనవరి 7 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 ప్రత్యేక బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు…